ఆదివారం సరదాగా.. ఈ నిజాలు మీకు తెలుసా (పార్ట్- 2)
మళ్లీ ఆదివారం వచ్చేసింది. ఈ రోజు కూడా సరదా సరదా విషయాలు, ఆశ్చర్యపరిచే సంగతులు కొన్ని తెలుసుకుందాం. – సింహాలు రెండేళ్ల వయసు వచ్చే వరకు గాండ్రించలేవు. – కొన్ని రకాల పురుగులకు 10 గుండెల వరకు ఉంటాయి. – బ్లూ వేల్ నాలుక బరువు కంటే ఏనుగు బరువు తక్కువగా ఉంటుంది. – మనిషి కళ్లు మూసుకోవడం వల్ల కొన్ని విషయాలు గుర్తుకు వస్తాయి. – భూమి మీద 20 శాతం ఆక్సిజన్ అమెజాన్ అడవుల […]
మళ్లీ ఆదివారం వచ్చేసింది. ఈ రోజు కూడా సరదా సరదా విషయాలు, ఆశ్చర్యపరిచే సంగతులు కొన్ని తెలుసుకుందాం.
– సింహాలు రెండేళ్ల వయసు వచ్చే వరకు గాండ్రించలేవు.
– కొన్ని రకాల పురుగులకు 10 గుండెల వరకు ఉంటాయి.
– బ్లూ వేల్ నాలుక బరువు కంటే ఏనుగు బరువు తక్కువగా ఉంటుంది.
– మనిషి కళ్లు మూసుకోవడం వల్ల కొన్ని విషయాలు గుర్తుకు వస్తాయి.
– భూమి మీద 20 శాతం ఆక్సిజన్ అమెజాన్ అడవుల నుంచే ఉత్పత్తి అవుతోంది.
– మనిషి మెదడు 25,00,000 గిగాబైట్స్ డేటాను దాచుకోగలదు.
– ఎడమచేతి వాటం కలిగిన వాళ్లు వీడియో గేమ్స్ బాగా ఆడగలరు.
– మనిషి జీవిత కాలంలో సగటున 60వేల పౌండ్ల ఆహారాన్ని తింటాడు.
– టాయిలెట్ సీటు మీద కంటే స్కూల్ డెస్కులపై 300 శాతం అధికంగా బ్యాక్టీరియా ఉంటుంది.
– మనిషి శరీరం ఉదయం 3 నుంచి 4 గంటల మధ్య బలహీనంగా ఉంటుంది.
– ఒంటరిగా ఒక గదిలో లేదా ఏకాంతంగా ఏ ప్రదేశంలో అయినా ఎక్కువ కాలం ఉంటే రోజుకు 15 సిగరెట్లు తాగినంత చెడు మనిషి శరీరానికి కలుగుతుంది.
– సముద్ర డాల్ఫిన్లు ఒకదాన్ని మరొకటి పేర్లతో పిలుచుకుంటాయి.
– తేలు 6 రోజుల వరకు ఊపిరి తీసుకోకుండా ఉండగలదు.
– అంతరిక్షంలో బతకగల ఏకైక జీవి వాటర్ బేర్.
– పిల్లులు మనిషిని చూసినప్పుడు మాత్రమే ‘మ్యావ్’ అని అరుస్తాయి.
– 12 మందిలో ఒక పురుషుడు కలర్ బ్లైండ్ (వర్ణ అంధత్వం) కలిగి ఉంటాడు.
– ప్రపంచంలో 74 శాతం మంది తమ జుట్టు గురించి శ్రద్ద, బాధ, భయం కలిగి ఉంటారు.
– నిద్రపోవడం వల్ల మన మెదడు శుభ్రపడుతుంది.
– నీటి బుడగలు నీళ్లను ఎక్కువ సేపు వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి.
– కొన్ని పిల్లులకు మనుషుల వల్ల ఎలర్జీ వస్తుంది.
– తేనెటీగలకు బాంబులను కనుగొనే శక్తి ఉంటుంది.
– కుక్కలు క్యాన్సర్‌ను వాసన చూసి పసిగట్టగలవు.
– ప్రతీ సెకనుకు భూమిపై 100 పిడుగులు పడుతుంటాయి.
– ప్రతీ సెకెనుకు మెక్‌డొనాల్డ్స్ ప్రపంచవ్యాప్తంగా 75 బర్గర్లు అమ్ముతుంది.
– బటర్ మిల్క్‌లో అసలు బటర్ ఉండదు.
– సాధారణ మనిషి 7 నిమిషాల్లో నిద్రపోగలడు.
– ఆపిల్ సంస్థ ఒకప్పుడు బట్టలు కూడా అమ్మింది.
ALSO READ: ఆదివారం సరదాగా.. ఈ నిజాలు మీకు తెలుసా