Telugu Global
Health & Life Style

కోపాన్ని ఎదుర్కోవడానికి సులువైన మార్గాలు..

కోపం ఆరోగ్యకరమైన మానవ భావోద్వేగం. కానీ అది నియంత్రణలో లేనప్పుడు ఎన్నో సమస్యల్ని తెచ్చిపెడుతుంది. ఇది శారీరక పరమైన మార్పులతో పాటు జీవన విధానం మీదా ప్రభావాన్ని చూపుతుంది. దీనితో గుండె స్పందన లోనూ మార్పులు వచ్చి రక్తపోటు పెరుగవచ్చు. హార్మోన్లు, అడ్రినలిన్, నోరాడ్రినలిన్ స్థాయిలు కూడా పెరుగుతాయి. కొందరిలో తరుచుగా ప్రతి విషయంలోనూ కోపం వస్తూ ఉంటుంది. కోపం రావడానికి తగిన సందర్భం అంటూ ఉండకపోవచ్చు. కొన్నిసార్లు వ్యక్తిగత కారణాలు కారణమైతే మరికొన్నిసార్లు కోపం రావడానిక […]

కోపాన్ని ఎదుర్కోవడానికి సులువైన మార్గాలు..
X

కోపం ఆరోగ్యకరమైన మానవ భావోద్వేగం. కానీ అది నియంత్రణలో లేనప్పుడు ఎన్నో సమస్యల్ని తెచ్చిపెడుతుంది. ఇది శారీరక పరమైన మార్పులతో పాటు జీవన విధానం మీదా ప్రభావాన్ని చూపుతుంది. దీనితో గుండె స్పందన లోనూ మార్పులు వచ్చి రక్తపోటు పెరుగవచ్చు. హార్మోన్లు, అడ్రినలిన్, నోరాడ్రినలిన్ స్థాయిలు కూడా పెరుగుతాయి.

కొందరిలో తరుచుగా ప్రతి విషయంలోనూ కోపం వస్తూ ఉంటుంది. కోపం రావడానికి తగిన సందర్భం అంటూ ఉండకపోవచ్చు. కొన్నిసార్లు వ్యక్తిగత కారణాలు కారణమైతే మరికొన్నిసార్లు కోపం రావడానిక సందర్భంతో పనిలేకుండానే కోపం పుట్టవచ్చు. అయితే అసలు మీలో కోపం రావడానిక బలమైన కారణాలు ఏమిటనే విషయంలో మీకు కొంత అవగాహన ఉండటం ఎంతైనా అవసరం. దీనివల్ల కోప్పడే సమయంలో కంట్రోల్ చేసుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంటుంది. నియంత్రించుకోలేనంతటి తీవ్రస్థాయిలో కోపం రావడం వల్ల ఆరోగ్యానికి పలు విధాలుగా నష్టం జరుగుతుందంటున్నారు వైద్యులు.

దిగులు అసూయ, అవమానం, అసహ్యం, ఆతృత, భయం ఓర్పు లేకపోవడం, అసంతృప్తి, ఒంటరితనం, ఇవన్నీ కోపానికి కారణమయ్యే అంశాలు… కనుక కోపాన్ని సాధ్యమైనంత వరకూ రాకుండా చూసుకోవాలి. ఒక వేళ వచ్చినప్పటికీ దానిని క్రమేణా పోగొట్టుకునే మార్గాలను అనుసరించాలి. కోపం కలిగినప్పుడు దానిని అదుపులో వుంచుకొవడానికి కొన్ని ప్రయత్నాలు చేయండిలా…

మీరు కోపంగా ఉన్నప్పుడు మీ భావాలను దృఢంగా తెలియపరచడం దూకుడుగా కాకుండా కోపాన్ని చూపేముందు మీ అవసరాలు ఏమిటో స్పష్టంగా చెప్పడం. ఇతరులను బాధపెట్టకుండా వాటిని ఎలా తీర్చుకోవాలో మీరు నేర్చుకోవాలి. దృఢంగా ఉండడానికి చూడాలి. అంటే ఒత్తిడి చేయడం లేదా డిమాండ్ చేయడం కాకుండా.. మీ అభిప్రాయాలను నిర్ణయాలను ఇతరల ముందు పెట్టగలగాలి.

కోపాన్ని ఆరోగ్యకరమైన రీతుల్లో కోపాన్ని ఎదుర్కోవడానికి ఈ మార్గాలను ప్రయత్నించండి.
మాట్లాడే ముందు ఆలోచించండి: ఏ విషయాన్నయినా ఒకటికి పదిసార్లు ఆలోచించి, ఆపై మాట్లాడడం మంచిది. కోపంగా ఉన్నప్పుడు మాటలు వదిలేసి తర్వాత పశ్చాత్తాపపడేలా పరిస్థితి దిగజారేలా చేసుకోకూడదు. విశ్రాంతి తీసుకోవడం, పరిస్థితిని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. ప్రశాంతంగా ఉన్న తర్వాతే, మీ కోపాన్ని వ్యక్తపరచండి: కోపం వచ్చినా కాస్త తమాయించుకుని ప్రశాంతంగా అనిపించిన తర్వాతే, మీ భావోద్వేగాలను ఎదుటివారికి తెలియపరచడం అలవాటు చేసుకోవాలి.

వ్యాయామం: కోపంగా ఉన్నప్పుడు కొంత సమయం పాటు నడవడానికి లేదా శారీరక వ్యాయామం చేయడం కొంతవరకూ మంచిది. శారీరక శ్రమతో ఒత్తిడిని తగ్గించడంలో దృష్టి పెట్టాలి. ఇది కండరాలకు విశ్రాంతిని అందించడంలో సహాయపడి..ఒత్తిడిని ఎదుర్కొనేందుకు మనస్సు, శరీరాన్ని రీఛార్జ్ చేయడంలో సహాయపడుతుంది.

సాధ్యమయ్యే పరిష్కారాలను గుర్తించండి: మీకు కోపం తెప్పించే విషయాలు, పరిస్థితులకు సాధ్యమైన పరిష్కారాలను ఆలోచించండి.

ఫిర్యాదులు చేయకండి..మీరు ఎదుర్కొంటున్న ఆందోళనను అది మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఎదుటి వ్యక్తికి ఫిర్యాదు చేయడానికి బదులుగా వారికి తెలిసేలా వ్యక్తపరచండి.

పగ పెంచుకోకండి: చిన్న చిన్న కారణాలకే వేరొకరిపై పగ పెంచుకోవడం వల్ల మన కోపం రెట్టింపుకావచ్చు. ఎదుటివారిని క్షమించి కోపాన్ని వదలడం మంచిది.

ఈ పరిస్థితిలో హాస్యాన్ని వాడుకోండి: హాస్యంతో పరిస్థితిని తేలికపరచవచ్చు. ఇది కోపాన్ని తగ్గించి కూల్ చేయడమే కాకుండా మనసుకు మంచి అనుభూతిని కూడా కలిగిస్తుంది.

తగినంత నిద్ర కూడా అవసరమే.. కంటి నిండా నిద్రపోతున్నారా లేదో చూసుకోవాలి. శరీరానికి సరిపడా నిద్ర చాలా అవసరం.
రిలాక్సేషన్ స్కిల్స్‌ను ప్రాక్టీస్ చేయండి: నలుగురితో కలవడం, నచ్చిన పనిని చేయడం మ్యూజిక్ వినడం వంటి వ్యాపకాలు కూడా మనసును రిలాక్స్ మూడ్ లోకి తీసువెళతాయి. లోతైన శ్వాస వ్యాయామాలు లేదా మనతో మనం మాట్లాడుకోవడం పరిస్థితి మెరుగుపడుతుందని భరోసా ఇవ్వడం వంటివి మనస్సును రిలాక్స్ చేయడానికి, కోపాన్ని తగ్గించుకోవడానికి కొన్ని మార్గాలు.

సహాయాన్ని తీసుకోండి: ఇన్ని చేసినా ఈ కోపాన్ని నియంత్రించుకోవడం ఒక్కోసారి సవాలుగా మారుతూ ఉంటుంది.. పరిస్థతి మన చేయిదాటిపోయిందని తెలిసినపుడు దానిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవడంలో నిపుణుల సహాయాన్ని కోరడం సరైనపని.

First Published:  3 July 2022 12:30 PM IST
Next Story