తమిళనాడులో కరోనా ఆంక్షలు.. ఏపీలోనూ అలర్ట్..
తమిళనాడులో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో తమిళనాడు వ్యాప్తంగా 2వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో చెన్నైలోనే 909 పాజిటివ్ కేసులు వెలుగు చూడటం ఆందోళనకరంగా ఉంది. చెంగల్పట్టులో 352, కాంచీపురంలో 71, తిరువళ్లూరులో 100 కేసులు నమోదయ్యాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, వేలూరు జిల్లాల్లో మాస్క్ లు ధరించడం తప్పనిసరి చేశారు. ఆయా ప్రాంతాల్లో మాస్క్ లు ధరించకపోతే రూ.500 […]
తమిళనాడులో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో తమిళనాడు వ్యాప్తంగా 2వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో చెన్నైలోనే 909 పాజిటివ్ కేసులు వెలుగు చూడటం ఆందోళనకరంగా ఉంది. చెంగల్పట్టులో 352, కాంచీపురంలో 71, తిరువళ్లూరులో 100 కేసులు నమోదయ్యాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, వేలూరు జిల్లాల్లో మాస్క్ లు ధరించడం తప్పనిసరి చేశారు. ఆయా ప్రాంతాల్లో మాస్క్ లు ధరించకపోతే రూ.500 జరిమానా తప్పదని ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
తమిళనాడులో కరోనా కేసులు పెరుగుతుండటంతో సీఎం స్టాలిన్ అధికారుల్ని అప్రమత్తం చేశారు. వైద్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేసులు పెరుగుతున్న జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయా ప్రాంతాల్లో చేపట్టిన ముందు జాగ్రత్త చర్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు గుమికూడకుండా చర్యలు తీసుకోవాలని, స్కూళ్లు, కాలేజీలు, ఆఫీస్ లు, షాపింగ్ మాల్స్.. వంటి చోట్ల థర్మల్ స్కానర్లు తప్పనిసరి చేయాలన్నారు. మాస్క్ ధారణ తప్పనిసరి చేయాలని సూచించారు.
ఇటు ఏపీలో కూడా కరోనా పట్ల రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా బందోబస్తు నిర్వహించే సిబ్బంది అందరికీ కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. గన్నవరం విమానాశ్రయంలో ఇప్పటికే అందరికీ కొవిడ్ పరీక్షలు చేపట్టారు. మోదీ పర్యటనలో జనం భారీగా గుమికూడే అవకాశం ఉండటంతో కొవిడ్ ప్రొటోకాల్ పాటించాల్సిందిగా అధికారులను అప్రమత్తం చేశారు.
సోమవారం మోదీ ఏపీలో పర్యటించబోతున్నారు. ఆయన పర్యటనను దృష్టిలో పెట్టుకుని వైద్యశాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రధానిని కలిసే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరినీ, ఆయన టూర్ కి సంబంధించిన ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏపీలో మంగళవారం నుంచి స్కూల్స్ తిరిగి మొదలు కాబోతున్న నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.