Telugu Global
National

కుటుంబ పాలనలను పడగొడతాం.. 6 రాష్ట్రాల్లో ఇక మాదే అధికారం.. బీజేపీ

దేశమంతా ఇక తమ చేతుల్లోకి వచ్చే తరుణం ఆసన్నమైందని బీజేపీ ప్రకటించింది. తెలంగాణ, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కుటుంబ పాలనలకు చరమగీతం పాడుతామని, త్వరలో ఏపీ, తమిళనాడు, కేరళ, ఒడిశా తదితర రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తామని వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఓ రాజకీయ తీర్మానాన్ని ఆమోదించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా దీన్ని ప్రతిపాదిస్తూ.. రానున్న 30, 40 ఏళ్ళు బీజేపీ శకమే అవుతుందని, […]

కుటుంబ పాలనలను పడగొడతాం.. 6 రాష్ట్రాల్లో ఇక మాదే అధికారం.. బీజేపీ
X

దేశమంతా ఇక తమ చేతుల్లోకి వచ్చే తరుణం ఆసన్నమైందని బీజేపీ ప్రకటించింది. తెలంగాణ, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కుటుంబ పాలనలకు చరమగీతం పాడుతామని, త్వరలో ఏపీ, తమిళనాడు, కేరళ, ఒడిశా తదితర రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తామని వెల్లడించింది.

ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఓ రాజకీయ తీర్మానాన్ని ఆమోదించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా దీన్ని ప్రతిపాదిస్తూ.. రానున్న 30, 40 ఏళ్ళు బీజేపీ శకమే అవుతుందని, ఇండియా ప్రపంచానికే ‘విశ్వగురువు’ అవుతుందని పేర్కొన్నారు.

కొన్ని రాష్ట్రాల్లో కుటుంబ పాలనలు, కుల తత్వంతో కూడిన రాజకీయాలు కొనసాగుతున్నాయని, వాటికి ఫుల్ స్టాప్ పెడతామని ఆయన చెప్పారు.

ఇన్నేళ్ళుగా దేశం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నదంటే అందుకు వారసత్వ రాజకీయాలు, కులతత్వం కారణమయ్యాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఇటీవల కొన్ని ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధించిందని, అంటే అభివృద్ధి, పనితీరు విషయంలో ఇది సఫలమైందని ప్రజలు గుర్తించినట్టేనన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఓ కుటుంబ పార్టీ మాదిరి తయారైందని, గాంధీ కుటుంబంలో పలువురు తమలో తాము ‘ప్రజాస్వామ్యం’ కోసం పోరాడుతున్నారని అన్నారు. పార్టీమీద పట్టు కోల్పోతామన్న భయంతోనే ఆ కుటుంబం సంస్థాగత ఎన్నికలను నిర్వహించడం లేదన్నారు.

ప్రభుత్వం చేస్తున్న ప్రతి మంచి పనిని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని, వాటి నిరాశావాదమే ఇందుకు కారణమని అమిత్ షా వ్యాఖ్యానించారు.

First Published:  3 July 2022 11:36 AM IST
Next Story