Telugu Global
MOVIE UPDATES

మైసూరులో హైడ్రామా.. పవిత్రను చెప్పుతో కొట్టబోయిన నరేష్ మూడో భార్య రమ్య

సినీనటుడు నరేష్ వ్యక్తిగత జీవితం బజారుకెక్కింది. పవిత్ర లోకేష్ అనే మరో నటిని ఆయన పెళ్లి చేసుకున్నాడో లేదో తెలియదు గానీ ఆయన మూడో భార్య రమ్య సీన్ లోకి ఎంటరైంది. తనకు నరేష్ విడాకులిస్తానంటున్నాడని, కానీ తాను అంగీకరించడం లేదని అటు బెంగుళూరులో, ఇటు హైదరాబాద్ లో మీడియా సమావేశాలు పెట్టి చెబుతున్న రమ్య ఆదివారం మైసూరులోని ఓ హోటల్ లో రచ్చరచ్చ చేసింది. నరేష్, పవిత్ర లోకేష్ ఇక్కడ బస చేశారని తెలుసుకున్న ఆమె.. […]

Naresh and Pavitra
X

సినీనటుడు నరేష్ వ్యక్తిగత జీవితం బజారుకెక్కింది. పవిత్ర లోకేష్ అనే మరో నటిని ఆయన పెళ్లి చేసుకున్నాడో లేదో తెలియదు గానీ ఆయన మూడో భార్య రమ్య సీన్ లోకి ఎంటరైంది.

తనకు నరేష్ విడాకులిస్తానంటున్నాడని, కానీ తాను అంగీకరించడం లేదని అటు బెంగుళూరులో, ఇటు హైదరాబాద్ లో మీడియా సమావేశాలు పెట్టి చెబుతున్న రమ్య ఆదివారం మైసూరులోని ఓ హోటల్ లో రచ్చరచ్చ చేసింది. నరేష్, పవిత్ర లోకేష్ ఇక్కడ బస చేశారని తెలుసుకున్న ఆమె.. ఉదయమే అక్కడికి చేరుకుంది. అప్పుడే గది నుంచి నరేష్, పవిత్ర రావడంతో.. ఆమెను చెప్పుతో కొట్టడానికి యత్నించింది.

అయితే ఆమెను నరేష్ తో బాటు అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. పవిత్రను దుర్భాషలాడుతూ ముందుకు రాబోయిన ఆమెను వారు వెనక్కి నెట్టినంత పని చేశారు. ఈ గందరగోళంలో నరేష్, పవిత్ర అక్కడి నుంచి మెల్లగా జారుకుని లిఫ్ట్ లోకి ఎంటరైపోయారు. రమ్యను చూస్తూ నరేష్.. హేళనగా కేకలు పెడుతూ.. విజిల్స్ వేస్తూ వెళ్ళిపోయాడు. బెంగుళూరులో నరేష్ ఓ కన్నడ చిత్రంలో నటిస్తున్నట్టు తెలిసింది.

మైసూరులోని హోటల్లో జరిగిన తతంగమంతా వీడియోలకెక్కి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. రమ్య ప్రవర్తన సరిగా లేదని, ఓ డ్రైవర్ తో ఆమె ఎఫైర్ పెట్టుకుందని, ఆమెకు తాను ఎన్నోసార్లు డబ్బులిచ్చానని, ఎనిమిదేళ్లుగా ఆమె తనను వేధిస్తోందని నరేష్ అంటున్నాడు.

ఒకసారి ఆమెకు 10 లక్షలు ఇచ్చానని చెప్పుకున్నాడు. తాను, పవిత్ర పెళ్లి చేసుకోలేదని, కేవలం సహజీవనం చేస్తున్నామని ఆయన అంటున్నాడు. అయితే రమ్య మాత్రం.. వాళ్లిద్దరూ కొన్ని రోజుల క్రితమే పెళ్లి చేసుకున్నారని, తనకు విడాకులు ఇవ్వకుండా నరేష్ మరో పెళ్లి ఎలా చేసుకుంటాడని ప్రశ్నిస్తోంది.

నరేష్ నుంచి తనకు ఒక్క రూపాయి కూడా అందలేదని, అతని ముఖం చూస్తే ఎవరూ ఒక్క పైసా కూడా ఇవ్వరని కసిగా వ్యాఖ్యానించింది. తన అత్తగారు (విజయనిర్మల) బతికి ఉంటే తనకీ కష్టాలు ఉండేవి కావని ఆమె వాపోయింది.

First Published:  3 July 2022 8:39 AM IST
Next Story