అక్రమ కట్టడాలు కూలిస్తే రాజకీయమా? – వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి
అక్రమ కట్టడాలు కూల్చడం కూడా తప్పేనా? అని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలోనైనా సరే అక్రమ కట్టడాలు ఉంటే నిబంధనల ప్రకారం కూల్చేయడం సహజమేనని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని రాజకీయం చేయడం సరికాదన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలు నిర్మించుకున్నారని ఆరోపించారు. వాటిని కచ్చితంగా ధ్వంసం చేస్తామని పునరుద్ఘాటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుకు మతి […]
అక్రమ కట్టడాలు కూల్చడం కూడా తప్పేనా? అని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలోనైనా సరే అక్రమ కట్టడాలు ఉంటే నిబంధనల ప్రకారం కూల్చేయడం సహజమేనని పేర్కొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని రాజకీయం చేయడం సరికాదన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలు నిర్మించుకున్నారని ఆరోపించారు. వాటిని కచ్చితంగా ధ్వంసం చేస్తామని పునరుద్ఘాటించారు.
శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుకు మతి భ్రమించిందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తానే అధికారంలోకి వస్తానని భ్రమల్లో బతుకుతున్నారని మండిపడ్డారు. ఒక నెగెటివ్ ఇమాజినేషనన్లోకి బాబు వెళ్లిపోయారని దుయ్యబట్టారు.
ఇలాంటి భ్రమలు, ఆలోచనలు వారి మీద వారికే పట్టు కోల్పోయిన వారికి వస్తాయని చెప్పారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఎలాంటి కట్టడాలు నిర్మించకూడదని తెలిసి కూడా తలలో మెదడు ఉన్నవారు ఎవరైనా ప్రజావేదిక పేరుతో అక్రమ కట్టడాలు నిర్మిస్తారా? అని ఆయన ప్రశ్నించారు.