Telugu Global
NEWS

యశ్వంత్ సిన్హా హైదరాబాద్ రాక…కాంగ్రెస్ లో చిచ్చు

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఈ రోజు హైదరాబాద్ వచ్చారు. ఆయనకు టీఆరెస్ భారీగా స్వాగతం పలికింది. ఆయన టీఆరెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా ఎం ఐ ఎం ఏంపీ, ఎమ్మెల్యేలను కూడా కలవబోతున్నారు. అయితే యశ్వంత్ సిన్హాకు ప్రధాన మద్దతుదారైన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతలు మాత్రం ఆయనను కలవడానికి నిరాకరించారు. ఈ వ్యవ‌హారమే ఆ పార్టీలో గొడవ‌కు దారి తీసింది. యశ్వంత్ సిన్హాను టీఆరెస్ ఆహ్వానించినందున తాము ఆయనను కలవబోమని పీసీసీ అధ్యక్షుడు […]

యశ్వంత్ సిన్హా హైదరాబాద్ రాక…కాంగ్రెస్ లో చిచ్చు
X

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఈ రోజు హైదరాబాద్ వచ్చారు. ఆయనకు టీఆరెస్ భారీగా స్వాగతం పలికింది. ఆయన టీఆరెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా ఎం ఐ ఎం ఏంపీ, ఎమ్మెల్యేలను కూడా కలవబోతున్నారు. అయితే యశ్వంత్ సిన్హాకు ప్రధాన మద్దతుదారైన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతలు మాత్రం ఆయనను కలవడానికి నిరాకరించారు. ఈ వ్యవ‌హారమే ఆ పార్టీలో గొడవ‌కు దారి తీసింది.

యశ్వంత్ సిన్హాను టీఆరెస్ ఆహ్వానించినందున తాము ఆయనను కలవబోమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైకమాండ్ ఆదేశాల మేరకు యశ్వంత్ సిన్హాకు ఓట్లు వేస్తామని అయితే ఆయనను ఆహ్వనించబోమని, అలాగే కలవబోమని ఆయన స్పష్టం చేశారు. అయితే రేవంత్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు హన్మంత రావు. అంతే కాదు స్వయంగా ఆయన బేగంపేట ఎయిర్ పోర్ట్ కు వెళ్ళి టీఆరెస్ నాయకులతో కలిసి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికారు.

పీసీసీ నిర్ణయంపై హన్మంత రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి హైదరాబాద్ వస్తే మనం ఆహ్వానించకపోవడం సోనియా గాంధీని అవమానించడమే అని మండిపడ్డారు. ఇది పార్టీని ధిక్కరించడమే అని హన్మంత రావు అన్నారు.

మరో వైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా యశ్వంత్ సిన్హా ను కాంగ్రెస్ ఆహ్వానించకపోవడాన్ని తప్పుబట్టారు. రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ను సీఎల్పీకి ఆహ్వానించి ఉండాల్సిందని జగ్గారెడ్డి అన్నారు. భట్టి విక్రమార్క ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. దీనిపై అధిష్ఠానానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. తాను యశ్వంత్ సిన్హా అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నానని అపాయింట్ మె‍ంట్ దొరికితే యశ్వంత్‌కు మద్దతు ప్రకటించి వస్తానని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

First Published:  2 July 2022 7:17 AM IST
Next Story