Telugu Global
NEWS

మోదీకి స్వాగతం అంటూనే సెటైర్లు వేసిన ప్రకాష్ రాజ్

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకోసం హైదరాబాద్ వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై నటుడు ప్రకాష్ రాజ్ సెటైర్లు వేశారు. హైదరాబాద్ కు వస్తున్న అత్యుత్తమ నాయకుడికి స్వాగతం అంటూనే పాలన ఎలా ఉండాలో తెలంగాణను చూసి నేర్చుకోవాలని ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. ”బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మోదీ పర్యటించినప్పుడు ప్రజల సొమ్మును ఖర్చు చేసి ఆయన కోసం రోడ్లు వేస్తుంటారు. తెలంగాణలో మాత్రం ప్రజల సొమ్మును ప్రజల అభివృద్ది కోసం మాత్రమే ఖర్చు చేస్తారు. ఈ […]

మోదీకి స్వాగతం అంటూనే సెటైర్లు వేసిన ప్రకాష్ రాజ్
X

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకోసం హైదరాబాద్ వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై నటుడు ప్రకాష్ రాజ్ సెటైర్లు వేశారు. హైదరాబాద్ కు వస్తున్న అత్యుత్తమ నాయకుడికి స్వాగతం అంటూనే పాలన ఎలా ఉండాలో తెలంగాణను చూసి నేర్చుకోవాలని ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్.

”బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మోదీ పర్యటించినప్పుడు ప్రజల సొమ్మును ఖర్చు చేసి ఆయన కోసం రోడ్లు వేస్తుంటారు. తెలంగాణలో మాత్రం ప్రజల సొమ్మును ప్రజల అభివృద్ది కోసం మాత్రమే ఖర్చు చేస్తారు. ఈ పర్యటనను ఆస్వాదించండి. మౌలిక సదుపాయాలు ఎలా కల్పించాలో దూర దృష్టితో నిర్ణయాలు ఎలా తీసుకోవాలో తెలంగాణను చూసి నేర్చుకోండి” అని ట్వీట్ లో పేర్కొన్నారు ప్రకాష్ రాజ్.

ఈ కామెంట్లతో పాటు తెలంగాణ అభివృద్దిని సూచించే కొన్ని ఫోటోలను కూడా ఆయన షేర్ చేశారు. కేసీఆర్‌ ఫొటోతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టు, యాదాద్రి, టీ హబ్, ప్రభుత్వ ఆసుపత్రి, గురుకుల పాఠశాల భవనాలతో కూడిన ఫొటోలను ప్రకాష్ రాజ్ షేర్‌ చేశారు.May be a Twitter screenshot of 2 people and text that says

First Published:  2 July 2022 7:59 AM IST
Next Story