Telugu Global
NEWS

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఆత్మ‌ప్ర‌భోదానుసారం ఓటు వేయండి -కేసీఆర్ పిలుపు

రాష్ట్రపతి ఎన్నికల్లో య‌శ్వంత్ సిన్హా గెలవబోతున్నారని టీఆరెస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఆత్మ‌ప్ర‌భోదానుసారం ఓటు వేయాలని ఆయన కోరారు. విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హాకు మ‌ద్ధ‌తుగా కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న హైదరాబాద్ లోని జ‌ల‌విహార్‌లో శ‌నివారం సభ జరిగింది. ఆసభలో కేసీఆర్ మాట్లాడుతూ…. భారత రాజకీయాలను మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. ”ప్రధాన మంత్రి మోదీ ఈరోజు రాష్ట్రానికి వస్తున్నారు. రెండు రోజుల పాటు ఉండి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. ఈ […]

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఆత్మ‌ప్ర‌భోదానుసారం ఓటు వేయండి -కేసీఆర్ పిలుపు
X

రాష్ట్రపతి ఎన్నికల్లో య‌శ్వంత్ సిన్హా గెలవబోతున్నారని టీఆరెస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఆత్మ‌ప్ర‌భోదానుసారం ఓటు వేయాలని ఆయన కోరారు. విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హాకు మ‌ద్ధ‌తుగా కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న హైదరాబాద్ లోని జ‌ల‌విహార్‌లో శ‌నివారం సభ జరిగింది.

ఆసభలో కేసీఆర్ మాట్లాడుతూ…. భారత రాజకీయాలను మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. ”ప్రధాన మంత్రి మోదీ ఈరోజు రాష్ట్రానికి వస్తున్నారు. రెండు రోజుల పాటు ఉండి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. ఈ సందర్భంగా మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి”అని ప్రధానిని కేసీఆర్ డిమాండ్ చేశారు.

మోదీ అధికారంలోకి రాక ముందు ఇచ్చిన హామీలేమయ్యాయి? నల్లధనం వెనక్కి తెస్తామన్నారు. ఒక్కొక్కరి అకౌంట్ లో 15 లక్షలు వేస్తామన్నారు. రూపాయి విలువ పెంచుతామన్నారు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు… ఇందులో ఒక్కటి కూడా అమలు జరగలేదు. నల్ల ధనం పెరిగిపోయింది, ఒక్క కొత్త ఉద్యోగం కూడా రాలేదు. ఉన్న ఉద్యోగాలను ఊడబీకారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేశారు. పెట్రోల్, డీజిల్ రేట్లు ఎన్నడూ లేనంత పెంచేశారు. రూపాయి విలువ ఎన్నడూ లేనంత తగ్గిపోయింది. ఆర్థిక వ్యవస్థ నాశనమయ్యింది. న‌ల్ల‌ చ‌ట్టాలు తెచ్చి రైతుల‌ను ఇబ్బందిపెట్టారు.” అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

”దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని హామీ ఇచ్చారు. ఆదాయం రెట్టింపు కాలేదు కానీ రైతుల ఖర్చు రెట్టింపయ్యింది. ఢిల్లీ రైతు ఆందోళనలో మృతి చెందిన రైతు కుటుంబాలకు మేము ఆర్థిక సహాయం చేస్తే మమ్ములను అవహేళన చేశారు. రైతులు మిమ్ములను ఏమడిగారు ? బంగారం అడిగారా? మద్దతు ధరే కదా వాళ్ళడిగింది. ప్రజలు కళ్ళు తెరిచారు ఇక మీ ఆటలు సాగవు. ఎందరో ప్రధానులను చూశాం ఎవ్వరూ శాశ్వ‌తం కాదని గుర్తుపెట్టుకోండి” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

బడా షావుకార్లకు మోదీ సేల్స్ మ్యాన్ లాగా పనిచేస్తున్నారని మండిపడ్డారు కేసీఆర్.మాకు అతి తక్కువ ధరకే వచ్చే బొగ్గును కొనకుండా అదానీ ఇంపోర్ట్ చేసే బొగ్గును ఎక్కువ ధరకు కొనాలని ఒత్తిడి తెచ్చారని కేసీఆర్ ఆరోపించారు.

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఉన్నత వ్యక్తిత్వ‍ంగల వార‌ని, వివిధ హోదాల్లో దేశానికి ఎనలేని సేవలు చేశారని, ఆయనకు అన్ని రంగాల్లో విశేష అనుభ‌వ‌ముందని కేసీఆర్ అన్నారు. యశ్వంత్ సిన్హా వంటి ఉన్నతమైన వ్యక్తి రాష్ట్రపతిగా ఉంటే దేశ‌ ప్రతిష్ట పెరుగుతుందని, అందువల్ల అభ్యర్థులను బేరీజువేసుకొని ఆత్మ‌ప్ర‌భోదానుసారం ఓటు వేయాలని ఆయన కోరారు.

First Published:  2 July 2022 5:34 AM GMT
Next Story