ఫేక్ న్యూస్ పోస్ట్ చేసిన బీజేపీ ముఖ్య నేత… ఆటాడుకున్న నెటిజనులు
ఒక హిందీ ఛానల్ ఓ వార్తను ప్రసారం చేసింది. అందులో యాంకర్… ‘ఉదయ్ పూర్ లో కన్హయ్య లాల్ అనే టైలర్ ను హత్య చేసిన హంతకులను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చిన్నపిల్లలుగా వర్ణించారు. వారిపై తనకెలాంటి కోపం లేదని అన్నారు” అని వ్యాఖ్యానించిన తర్వాత అందులో రాహుల్ మాట్లాడిన వీడియో ప్రసారం చేశారు. అందులో రాహుల్ గాంధీ ఏమన్నారంటే… ”హింస అనేది ఏ సమస్యకు పరిష్కారం కాదు. ఇలాంటి హింసాత్మక ఘటనకు ఎవరూ పాల్పడకూడదు […]
ఒక హిందీ ఛానల్ ఓ వార్తను ప్రసారం చేసింది. అందులో యాంకర్… ‘ఉదయ్ పూర్ లో కన్హయ్య లాల్ అనే టైలర్ ను హత్య చేసిన హంతకులను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చిన్నపిల్లలుగా వర్ణించారు. వారిపై తనకెలాంటి కోపం లేదని అన్నారు” అని వ్యాఖ్యానించిన తర్వాత అందులో రాహుల్ మాట్లాడిన వీడియో ప్రసారం చేశారు. అందులో రాహుల్ గాంధీ ఏమన్నారంటే…
”హింస అనేది ఏ సమస్యకు పరిష్కారం కాదు. ఇలాంటి హింసాత్మక ఘటనకు ఎవరూ పాల్పడకూడదు ఇది ఒక బాధ్యతరాహిత్య ప్రవర్తన కలిగిన వారు చేసిన చర్య అయితే.. నాకు ఈ దాడికి పాల్పడిన వారి మీద ఎలాంటి కోపం లేదు. దాడి చేసిన వాళ్లు తెలిసీ తెలియని పిల్లలు” అని రాహుల్ అన్నారు.
ఈ మాటలు వింటే మీకు కూడా రాహుల్ పై కోపం వస్తోంది కదా ? ఇక బీజేపీ నాయకులు ఆ న్యూస్ ఛానల్ ప్రసారం చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్లు చేసి రాహుల్ మీద దాడి మొదలు పెట్టారు.
అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ మధ్య రాహుల్ గాంధీ కేరళ వెళ్ళారు. అంతకు కొన్ని రోజుల క్రితం వయనాడ్‌లోని రాహుల్ గాంధీ కార్యాలయాన్ని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అందులో ఎస్ ఎఫ్ ఐ విద్యార్థులు కూడా ఉన్నట్టు పోలీసులు కనుగొన్నారు. దీనిపై అక్కడ జర్నలిస్టులు రాహుల్ గాంధీని ప్రశ్నించినప్పుడు ఆయన ఆ మాటలు మాట్లాడారు. ఇప్పుడు ఒక సారి మళ్ళీ రాహుల్ మాట్లాడిన మాటలను చదవండి. అసలు విషయం అర్దమవుతుంది.
ఇక ఛానల్ ప్రసారం చేసిన వార్త పై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు ఆ ఛానల్ పై న్యాయపరమైన చర్యలకు సిద్దమయ్యారు. తన తప్పును గ్రహించిన ఛానల్ ఆ వీడియో ప్రసారం చేసినందుకు క్షమాపణ చెప్పింది. దీనికి బాధ్యత వహిస్తూ ఛానల్ లో కీలక వ్యక్తి రాజీనామా చేశారు.
అయినా బీజేపీ నేతలు మాత్రం తమ ప్రచారాన్నిఆపలేదు. ఛానల్ క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఏకంగా కేంద్ర మాజీ సమాచార, ప్రసార శాఖ మంత్రి, బీజేపీ ముఖ్య నేత, ఎంపీ రాజ్యవర్ధన్ రాథోర్ ఆ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసి రాహుల్ పై విమర్షలు చేశారు. దాంతో ఆయన ట్వీట్ పై నెటిజనులు మండిపడుతున్నారు. తాను చేసిన తప్పుకు ఛానలే క్షమాపణ చెప్పిన తర్వాత కూడా రాథోర్ ఆ వీడియోను షేర్ చేయడాన్ని నెటిజనులు తప్పుబట్టారు. ”మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఫేక్ న్యూస్ ను ప్రచారం చేస్తారా” అని రాథోర్ ను ఆటాడుకున్నారు.
ప్రముఖ మహిళా జర్నలిస్ట్ అనితా జోషువా రాథోర్ ట్వీట్ పై స్పందిస్తూ అది ఫేక్ వీడియో అని తెలుసుకున్న ఆ ఛానల్ క్షమాపణ చెప్పిన తర్వాత 45 నిమిషాలకు మాజీ మంత్రి రాజ్యవర్ధన్ రాథోర్ ఇలా ఫేక్ వీడియోను పోస్ట్ చేశారని ట్వీట్ చేశారు.
ఇంత జరిగినా… ఆ వీడియో ఫేక్ అని తెలిసిన తర్వాత కూడా బీజేపీ నాయకులు ప్రచారం చేయడం పట్ల నెటిజనులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రులే ఇలాంటి పనులు చేస్తే ఇక సాధారణ కార్యకర్తలు చేయరా ? అని నెటిజనులు ప్రశ్నిస్తున్నారు.
దీనిపై రాహుల్ గాంధీ కూడా స్పందించారు. బీజేపీ, ఆరెస్సెస్ లు అబద్దాల పునాదుల మీదే నిర్మించబడ్డాయి అని మండిపడ్డారు.
కాగా ఈ వీడియోను ఒక్క రాజ్యవర్ధన్ రాథోర్ మాత్రమే కాక బీజేపీ మరో ఎంపీ సుబ్రత్ పాఠక్, ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఎమ్మెల్యే కమలేష్ సైనీలు కూడా షేర్ చేసి ప్రచారం చేశారు.