Telugu Global
NEWS

నామా నాగేశ్వర్ రావు ఆస్తులను జప్తు చేసిన ఈడీ

పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వర్ రావుకు చెందిన మధుకాన్ గ్రూపు ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) జప్తు చేసింది. రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే కేసులో మధుకాన్ గ్రూపుకు చెందిన 96.21 కోట్ల రూపాయల ఆస్తులను ED ఈ రోజు అటాచ్ చేసింది. రాంచీ, జంషడ్ పూర్ రహదారి నిర్మాణం పేరిట బ్యాంకుల నుంచి మధుకాన్ గ్రూపు 1,030 కోట్ల రూపాయల రుణాలను పొంది ఆ తర్వాత ఆ నిధులను దారి మళ్ళించినట్టు ED […]

నామా నాగేశ్వర్ రావు ఆస్తులను జప్తు చేసిన ఈడీ
X

పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వర్ రావుకు చెందిన మధుకాన్ గ్రూపు ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) జప్తు చేసింది. రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే కేసులో మధుకాన్ గ్రూపుకు చెందిన 96.21 కోట్ల రూపాయల ఆస్తులను ED ఈ రోజు అటాచ్ చేసింది.

రాంచీ, జంషడ్ పూర్ రహదారి నిర్మాణం పేరిట బ్యాంకుల నుంచి మధుకాన్ గ్రూపు 1,030 కోట్ల రూపాయల రుణాలను పొంది ఆ తర్వాత ఆ నిధులను దారి మళ్ళించినట్టు ED ఆరోపించింది. 6 ఫేక్ కంపెనీల పేర్లతో ఈ నిధుల మళ్ళింపు జరిగిందని, ఆ కంపెనీలు నామా నాగేశ్వర్ రావు, నామా సీతయ్యల పేర్లతో ఉన్నాయని ED తెలిపింది.

పూర్తి రుణాన్ని పొందినప్పటికీ, మధుకాన్ గ్రూప్ ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయలేకపోయింది అని ED ఆరోపించింది. ”దాంతో వారి కాంట్రాక్ట్ రద్దు చేయబడింది. మధుకాన్ కంపెనీ తీవ్రమైన మోసాలు చేసినట్టు రుజువు చేయబడిన కారణంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేర‌కు మేము చర్యలు తీసుకున్నాం” అని ED అధికారులు చెప్పారు.

హైదరాబాద్, విశాఖ, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉన్న 88.85 కోట్ల రూపాయల విలువైన భూములు, 7 కోట్ల 36 లక్షల రూపాయల చరాస్తులు, మధుకాన్ షేర్లను ED అటాచ్ చేసింది.

First Published:  2 July 2022 1:11 PM IST
Next Story