Telugu Global
NEWS

కల నెరవేర్చుకుంటున్న బండి సంజయ్

బండి సంజయ్.. ఒక మామూలు పార్టీ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి.. ఇవాళ బీజేపీ స్టేట్ చీఫ్‌గా ఎదిగారు. కౌన్సిలర్‌గా ఎన్నికైనప్పటి నుంచి ఎన్నికల బరిలో నిలుస్తూ.. ఎంపీగా విజయం అందుకున్నారు. హైదరాబాద్‌లో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న వేళ బండి సంజయ్ ఆకాశంలో తేలిపోతున్నారు. 18 ఏళ్ల క్రితం తాను కన్న కలను ఇవాళ నిజం చేసుకుంటున్నందుకు ఆయన ఉత్సహంతో ఉబ్బితబ్బిబవుతున్నారు. హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు తొలి సారిగా 2004లో జరిగాయి. అప్పుడు బండి […]

Bandi Sanjay
X

బండి సంజయ్.. ఒక మామూలు పార్టీ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి.. ఇవాళ బీజేపీ స్టేట్ చీఫ్‌గా ఎదిగారు. కౌన్సిలర్‌గా ఎన్నికైనప్పటి నుంచి ఎన్నికల బరిలో నిలుస్తూ.. ఎంపీగా విజయం అందుకున్నారు. హైదరాబాద్‌లో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న వేళ బండి సంజయ్ ఆకాశంలో తేలిపోతున్నారు. 18 ఏళ్ల క్రితం తాను కన్న కలను ఇవాళ నిజం చేసుకుంటున్నందుకు ఆయన ఉత్సహంతో ఉబ్బితబ్బిబవుతున్నారు.

హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు తొలి సారిగా 2004లో జరిగాయి. అప్పుడు బండి సంజయ్ భారతీయ యువ మోర్చాలో కార్యకర్తగా ఉన్నారు. అప్పుడే.. తాను కూడా ఏదో ఒక రోజు బీజేపీలో పెద్ద నాయకుడినై ఇలాంటి కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నట్లు స్వయంగా చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో అధికారం కోసం ఆరాటపడుతున్న వేళ, తాను స్టేట్ లీడ్‌గా ఉన్న సమయంలోనే మళ్లీ హైదరాబాద్ వేదికగా ఎన్ఈసీ మీటింగ్స్ జరుగుతుండటతో సంజయ్ సంతోషంగా ఉన్నారు. ఆనాడు తాను కన్న కల నేడు సాకారం అవుతోందని అంటున్నారు.

ఎల్‌కే అద్వాని రధయాత్ర నిర్వహించిన సమయంలో బండి సంజయ్ కీలక పాత్ర పోషించారు. ఆ యాత్ర మొత్తం ఆయన పార్టీకి అవసరం అయిన సహాయం చేశారు. ఇక 2004 కార్యవర్గ సమావేశాల సమయంలో ఎల్‌కే అద్వాని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నారు. దీంతో బండి సంజయ్‌కి కూడా ఆ సమావేశాల్లో పాల్గొనే అవకాశం లభించింది. ‘ఒక సాధారణ కార్యకర్తగా పార్టీలో ప్రయాణం ప్రారంభించి, ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడిని అయ్యాను. సామాన్యుడికి కూడా మా పార్టీలో నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారనడానికి నేనే సాక్ష్యం’ అని బండి సంజయ్ అన్నారు.

బీజేపీ ఎన్ఈసీ సమావేశాలు జరుగుతున్న సమయంలో టీఆర్ఎస్ పార్టీ చీప్ పాలిటిక్స్‌ చేస్తోందని విమర్శించారు. అనవసరంగా ఫ్లెక్సీ వార్ సృష్టించిందని.. తమ మీటింగ్‌కు రాకుండా రోడ్లు బ్లాక్ చేస్తోందని సంజయ్ ఆరోపించారు. పీఎం నరేంద్ర మోడీ హైదరాబాద్‌కు వస్తున్న సమయంలో కావాలనే.. రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను రప్పించి ఆర్భాటం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. 2004లో పార్టీ చీఫ్‌గా ఉన్న ఎన్. ఇంద్రసేనారెడ్డి సహా అప్పటి ఉమ్మడి ఏపీలోని ఎమ్మల్యేలతో కలసి ఎన్ఈసీ మీటింగ్స్ కొరకు పనిచేయడం సంతోషంగా ఉందని సంజయ్ చెప్పారు.

First Published:  2 July 2022 12:17 AM GMT
Next Story