మణిపూర్ లో కొండ చెరియలు విరిగిపడి 81 మంది మృతి!
మణిపూర్ లో కొండ చెరియలు విరిగిపడి 81 మంది మరణించారు.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండ చెరియలు విరిగిపడ్డాయి. ఇది మణిపూర్ చరిత్రలోనే అత్యంత దారుణమైన సంఘటనగా ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ అన్నారు. జిరిబామ్ నుండి ఇంఫాల్ వరకు నిర్మాణంలో ఉన్న రైల్వే లైన్ రక్షణ కోసం టుపుల్ రైల్వే స్టేషన్ సమీపంలో మోహరించిన భారత సైన్యం క్యాంపులపై ఈ కొండ చెరియలు విరిగి పడ్డాయి. ఇందులో సైన్యంతో పాటు అనేక మంది పౌరులు కూడా […]
మణిపూర్ లో కొండ చెరియలు విరిగిపడి 81 మంది మరణించారు.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండ చెరియలు విరిగిపడ్డాయి. ఇది మణిపూర్ చరిత్రలోనే అత్యంత దారుణమైన సంఘటనగా ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ అన్నారు.
జిరిబామ్ నుండి ఇంఫాల్ వరకు నిర్మాణంలో ఉన్న రైల్వే లైన్ రక్షణ కోసం టుపుల్ రైల్వే స్టేషన్ సమీపంలో మోహరించిన భారత సైన్యం క్యాంపులపై ఈ కొండ చెరియలు విరిగి పడ్డాయి. ఇందులో సైన్యంతో పాటు అనేక మంది పౌరులు కూడా మరణించారు.
కాగా, సహాయక చర్యల్లో కేంద్రం నుంచి రాష్ట్రానికి పూర్తి సహకారం లభిస్తోందని సీఎం బీరెన్ చెప్పారు. “రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి కేంద్రం NDRF, ఆర్మీ సిబ్బందిని కూడా పంపింది. ఇక్క డ నేల బురదతో ఉండటం వల్ల వాహనాలు రావడం కూడా కష్టంగా ఉంది అందువల్ల సహాయక చర్యలు ఆలస్యమవుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్‌కు మరో 2-3 రోజులు పడుతుంది” అని సిఎం బీరెన్ చెప్పారు.
మరో వైపు కొండచెరియలు విరిగిపడిన సంఘటన స్థలం నుంచి సెర్చ్ ఆపరేషన్‌లో 8మంది ఆర్మీ సిబ్బంది,నలుగురు పౌరులతో సహా మరో 12 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని భారత సైన్యం తెలిపింది