Telugu Global
NEWS

చేతగాని బీజేపీ చివరకు ఫ్లెక్సీలు చించుతోంది..

దేశాన్ని అభివృద్ధి చేయడం చేతగాని బీజేపీ, చివరకు ఫ్లెక్సీలు చించుకుంటూ కాలం గడుపుతోందని మండిపడ్డారు టీఆర్ఎస్ నేతలు. హైదరాబాద్ లో తెలంగాణ అభివృద్ధిని చాటుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్ లను బీజేపీ నేతలు కావాలనే చించేస్తున్నారని, వారి విధ్వంస రాజకీయాలకు ఇదో నిదర్శనం అని చెబుతున్నారు. హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వేళ.. టీఆర్ఎస్-బీజేపీ మధ్య ఫ్లెక్సీ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. మోదీని పొగుడుతూ బీజేపీ వాళ్లు కూడా ఫ్లెక్సీలు వేసుకున్నారు. […]

BJP national executive meet
X

దేశాన్ని అభివృద్ధి చేయడం చేతగాని బీజేపీ, చివరకు ఫ్లెక్సీలు చించుకుంటూ కాలం గడుపుతోందని మండిపడ్డారు టీఆర్ఎస్ నేతలు.

హైదరాబాద్ లో తెలంగాణ అభివృద్ధిని చాటుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్ లను బీజేపీ నేతలు కావాలనే చించేస్తున్నారని, వారి విధ్వంస రాజకీయాలకు ఇదో నిదర్శనం అని చెబుతున్నారు. హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వేళ.. టీఆర్ఎస్-బీజేపీ మధ్య ఫ్లెక్సీ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. మోదీని పొగుడుతూ బీజేపీ వాళ్లు కూడా ఫ్లెక్సీలు వేసుకున్నారు.

అదే సమయంలో కేసీఆర్ ని విమర్శిస్తూ కూడా కొన్ని ఫ్లెక్సీలు వెలిశాయి. దీనికి ప్రతిగా సాలుమోదీ-సంపకు మోదీ అనే పోస్టర్లు బయటకొచ్చాయి. పోనీ అంతవరకు ఒకరినొకరు తిట్టుకున్నారు సరే. మిగతా పోస్టర్లు ఏం చేశాయి. మోదీకి వెల్కమ్ చెబుతూ బీజేపీ నేతలు వేసుకున్న ఫ్లెక్సీలను ఎవరూ ఏమీ చేయలేదు.

అదే సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వ విజయాలను చెబుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోస్టర్లను మాత్రం కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. బీజేపీ నేతలే ఈ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్నారు టీఆర్ఎస్ నేతలు.

ఫ్లెక్సీలను చూసి భయపడుతున్నారా..?
తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ ప్రభుత్వ విజయాలను చెబుతూ ఫ్లెక్సీలు వెలిశాయి. నగర శివార్లలో ఉన్న ఈ ఫ్లెక్సీలలో ఎక్కడా ఎవరినీ కించపరచలేదు. కేవలం కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, వాటి ఫలితాలు మాత్రమే హైలెట్ అయ్యాయి.

అయితే బీజేపీ దీన్ని భరించలేకపోతోంది. తెలంగాణలో అభివృద్ధి శూన్యం అంటూ ఓవైపు బీజేపీ విమర్శిస్తుండగా.. ఈ విజయాలను ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం బీజేపీ నేతలకు కంటగింపుగా మారింది. దీంతో వారు ఫ్లెక్సీలను చించేస్తున్నారని మండిపడుతున్నారు టీఆర్ఎస్ నేతలు.

విధ్వంసానికి ఇదే నిదర్శనం..
వాస్తవానికి జాతీయ కార్యవర్గ సమావేశాలు కేవలం హైదరాబాద్ కే పరిమితం అయినా.. అవి జరిగేది కేవలం రెండురోజులే అయినా.. బీజేపీ మాత్రం తెలంగాణపై పెద్ద దండయాత్రలాగా ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. రెండు రోజుల ముందుగానే బీజేపీ నేతలంతా తెంలగాణకు వచ్చేస్తున్నారు.

ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో కీలక నేత పర్యటిస్తున్నారు. బస్సులు, రైళ్లలో బీజేపీ కార్యకర్తలను పరేడ్ గ్రౌండ్స్ కి రప్పిస్తున్నారు. ఇంత చేస్తున్నా బీజేపీ నేతలను భయం వెంటాడుతోందని, అందుకే వారు తమ బ్యానర్లను చించేస్తున్నారని మండిపడుతున్నారు టీఆర్ఎస్ నేతలు.

First Published:  1 July 2022 10:17 AM IST
Next Story