Telugu Global
National

నీ ‘లూజ్ టంగ్’ వల్ల దేశం తగలబడిపోయింది.. నుపుర్‌కు సుప్రీంకోర్టు చీవాట్లు

మహ్మద్ ప్రవక్తపై ఓ టీవీ డిబేట్‌లో అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మకు అత్యున్నత కోర్టు చీవాట్లు పెట్టింది. నీ లూజ్ టంగ్ కారణంగా దేశం మొత్తం తగలబడి పోయిందని.. ఈ క్రమంలో ఉదయ్‌పూర్‌లో ఓ వ్యక్తి హత్యకు కూడా గురయ్యాడని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల అనంతరం దేశంలోని పలు చోట్ల నుపుర్ శర్మపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఆ కేసులన్నింటినీ ఢిల్లీకి బదిలీ […]

Nupur Sharma
X

మహ్మద్ ప్రవక్తపై ఓ టీవీ డిబేట్‌లో అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మకు అత్యున్నత కోర్టు చీవాట్లు పెట్టింది. నీ లూజ్ టంగ్ కారణంగా దేశం మొత్తం తగలబడి పోయిందని.. ఈ క్రమంలో ఉదయ్‌పూర్‌లో ఓ వ్యక్తి హత్యకు కూడా గురయ్యాడని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల అనంతరం దేశంలోని పలు చోట్ల నుపుర్ శర్మపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఆ కేసులన్నింటినీ ఢిల్లీకి బదిలీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. శుక్రవారం టాప్ కోర్టు ఆ పిటిషన్‌ను విచారించింది.

టీవీ డిబేట్ అనంతరం తనను చంపుతామని వేర్వేరు రాష్ట్రాల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. నాకు ప్రాణ హాని ఉన్నందున తనపై ఉన్న కేసులన్నింటినీ ఢిల్లీకి బదిలీ చేయాలని నుపుర్ పిటిషన్‌లో కోరింది. తాను ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని, క్షమాపణలు కూడా చెబుతున్నానని తెలిపింది. అయితే కోర్టు మాత్రం వాటిని అంగీకరించలేదు. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యిందని వ్యాఖ్యానించింది.

ఒక పార్టీకి అధికార ప్రతినిధి హోదాలో ఉండి, అధికారం నెత్తిన ఎక్కడంతో మూర్ఖత్వం, అహంకారంతో అలాంటి వ్యాఖ్యలు చేసిందని కోర్టు చెప్పింది. ఇలాంటి వ్యక్తులు మతానికి కట్టుబడి ఉండే వాళ్లు కాదు. నిజమైన మతాచారాలు పాటించేవాళ్లు చాలా గౌరవంగా ఉంటారని అత్యున్నత కోర్టు వ్యాఖ్యానించింది.

నుపుర్ తరుపు అడ్వొకేట్ మనీందర్ సింగ్ ఆమె వ్యక్తిత్వాన్ని సమర్ధించే ప్రయత్నం చేశారు. వ్యాఖ్యల చేసిన వెంటనే ఆమె క్షమాపణలు చెప్పారంటూ కవర్ చేయడానికి ప్రయత్నించారు. అయితే.. ఇలాంటి మనుషులకు ఒక ప్రత్యేక అజెండా ఉంటుంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నీచమైన పద్దతుల్లో చీప్ పబ్లిసిటీ కోరుకుంటారంటూ సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆమె ఫిర్యాదు చేస్తే ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. కానీ, ఈమెపై ఎన్నో ఎఫ్ఐఆర్‌లు నమోదైనా ఢిల్లీ పోలీసులు మాత్రం కనీసం ఆమెను తాకను కూడా తాకలేదంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం మండిపడింది. పదేళ్ల నుంచి లాయర్ వృత్తిలో ఉన్నానని చెప్పుకుంటూ.. అన్నీ బాధ్యతారహితమైన స్టేట్మెంట్లు ఇస్తోంది. ఈమె దేశం మొత్తానికి క్షమాపణ చెప్పాలని సుప్రీంకోర్టు అన్నది.

ఢిల్లీ పోలీసులు పెట్టిన ఎఫ్ఐఆర్‌కు సంబంధించిన దర్యాప్తులో తాను పాలుపంచుకున్నానని నుపుర్ శర్మ కోర్టుకు చెప్పగా.. ఎంత వరకు వచ్చింది ఆ దర్యాప్తు.. అక్కడ నీకు రెడ్ కార్పెట్ పరిచి ఉంటారే.. అని సుప్రీంకోర్టు ఎద్దేవా చేసింది. ఎఫ్ఐఆర్‌లు ఎక్కడెక్కడ నమోదైతే అక్కడి ట్రయల్ కోర్టుకు వెళ్లి బెయిల్ అప్లికేషన్ పెట్టుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. అయితే, అర్నబ్ గోస్వామి కేసులో.. ఒకే రకమైన నేరంలో దాఖలైన వేర్వేరు కేసులను.. ఒకే దగ్గర విచారించారని నుపుర్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలియజేశారు.

First Published:  1 July 2022 4:06 AM GMT
Next Story