Telugu Global
National

‘ప్రభుత్వం మారగానే ప్రేమ లేఖ అందింది’

మహారాష్ట్ర శివసేన రెబెల్ ఎమ్మెల్యేల నాయకుడు ఏక్‌నాథ్ షిండే కొత్త ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌లు ప్రమాణస్వీకారం చేసిన కొద్ది సేపటికే నేషనలిస్ట్ కాంగ్రెస్ (NCP)అధినేత శరద్ పవార్ కు ఇన్కం టాక్స్ (IT)శాఖ నోటీసులు జారీ చేసింది. ”2004, 2009, 2014, 2020 ఎన్నికల సమయం లో నేను సమర్పించిన ఎన్నికల్ అఫిడవిట్ కు సంబంధించి ఐటీ శాఖ నాకు ప్రేమ లేఖ పంపింది” అని పవార్ ట్వీట్ చేశారు. ప్రభుత్వం మారగానే పవార్ […]

‘ప్రభుత్వం మారగానే ప్రేమ లేఖ అందింది’
X

మహారాష్ట్ర శివసేన రెబెల్ ఎమ్మెల్యేల నాయకుడు ఏక్‌నాథ్ షిండే కొత్త ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌లు ప్రమాణస్వీకారం చేసిన కొద్ది సేపటికే నేషనలిస్ట్ కాంగ్రెస్ (NCP)అధినేత శరద్ పవార్ కు ఇన్కం టాక్స్ (IT)శాఖ నోటీసులు జారీ చేసింది.

”2004, 2009, 2014, 2020 ఎన్నికల సమయం లో నేను సమర్పించిన ఎన్నికల్ అఫిడవిట్ కు సంబంధించి ఐటీ శాఖ నాకు ప్రేమ లేఖ పంపింది” అని పవార్ ట్వీట్ చేశారు.

ప్రభుత్వం మారగానే పవార్ కు ఐటీ నోటీసులు రావడం యాదృచ్ఛికమా లేక దీని వెనక మరేదైనా మతలబు ఉందా? అని మహారాష్ట్ర ఎన్సీపీ ముఖ్య అధికార ప్రతినిధి మహేశ్ తపసే ప్రశ్నించారు.

తన పోల్ అఫిడవిట్‌లపై పవార్ ఇంతకుముందు సెప్టెంబర్ 2020లో కూడా ఇదే విధమైన నోటీసును అందుకున్నారు. ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే , సుప్రియా సూలేలకు కూడా ఐటీ శాఖ గతంలో నోటీసులు జారీ చేసింది దీనిపై పవార్ మాట్లాడుతూ “వారు కొంతమందిని ప్రేమిస్తున్నారు” అని అన్నారు.

ఆ తర్వాత, 2021 అక్టోబర్‌లో పవార్ మేనల్లుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, అతని సోదరీమణుల ఇళ్ళపై ఆదాయపు పన్ను దాడులపై స్పందిస్తూ పవార్ ”అజిత్ ఇంటికి కొంతమంది ప్రభుత్వ అతిథులు వచ్చారు, కానీ నేను వారి గురించి ఆందోళన చెందడం లేదు. ” అన్నారు

‘‘అజిత్ పవార్ ఇంటి వద్దకు ప్రభుత్వ అతిథులు వచ్చారు. ఈ అతిథుల గురించి మేము చింతించడం లేదు. ఎన్నికలకు ముందు బ్యాంకుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుండి నాకు కూడా నోటీసు వచ్చింది. నేనెప్పుడూ ఆ బ్యాంక్‌లో మెంబర్‌ని కాదు, నేను ఎలాంటి లోన్ తీసుకోలేదు. బీజేపీ అధికార దుర్వినియోగం చేస్తోంది. ప్రజలు బీజేపీ స్థానమేంటో వారికి చూపిస్తారు’’ అని పవార్ ఆరోపించారు.

ప్రత్యర్థులకు ఇబ్బందులు సృష్టించేందుకు ఆదాయపు పన్ను, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌తో సహా కేంద్ర దర్యాప్తు సంస్థలను బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని పవార్ తో సహా సంజయ్ రౌత్, జయంత్ పాటిల్, బాలాసాహెబ్ థోరట్ లు ఆరోపించారు.

మనీలాండరింగ్ కేసులో పవార్ సన్నిహితుడు, శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి రెండోసారి సమన్లు ​​రావడం కేవలం యాదృచ్చికం కాదని వారు ఆరోపించారు.

First Published:  1 July 2022 7:18 AM IST
Next Story