పవన్ కల్యాణ్ రీమేక్ కు ఆల్ సెట్
రీసెంట్ గా పవన్ కల్యాణ్ మరో రీమేక్ లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. తన మేనల్లుడు సాయితేజ్ తో కలిసి వినోదాయ శితం సినిమా రీమేక్ ను ఆయన లాంఛ్ చేశారు. పీపుల్ మీడియా, జీ స్టుడియోస్ బ్యానర్లపై రాబోతున్న ఈ సినిమాకు ఇప్పుడంతా సెట్ అయింది. డేట్స్ అన్నీ లాక్ అయ్యాయి. ఈనెల 12 నుంచి పవన్ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాడు. ఈ మేరకు వరుసగా 20 రోజుల కాల్షీట్లు కేటాయించాడు. […]
రీసెంట్ గా పవన్ కల్యాణ్ మరో రీమేక్ లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. తన మేనల్లుడు సాయితేజ్ తో కలిసి వినోదాయ శితం సినిమా రీమేక్ ను ఆయన లాంఛ్ చేశారు. పీపుల్ మీడియా, జీ స్టుడియోస్ బ్యానర్లపై రాబోతున్న ఈ సినిమాకు ఇప్పుడంతా సెట్ అయింది. డేట్స్ అన్నీ లాక్ అయ్యాయి.
ఈనెల 12 నుంచి పవన్ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాడు. ఈ మేరకు వరుసగా 20 రోజుల కాల్షీట్లు కేటాయించాడు. ఈ 20 రోజుల్లోనే సినిమాకు సంబంధించి పవన్ పోర్షన్ మొత్తం పూర్తిచేయాల్సి ఉంది. దీనికి సంబంధించి సాయితేజ్ తో పాటు ఇతర నటీనటుల కాల్షీట్లన్నీ సర్దుబాటు చేశారు.
పవన్ పోర్షన్ పూర్తయితే, సినిమా దాదాపు కొలిక్కి వచ్చేసినట్టే. ఎందుకంటే, ఇతర నటీనటులతో కాల్షీట్ల సమస్య ఉండదు. ఇక పవన్ డబ్బింగ్ పెద్ద సమస్య కాదు.
ఏదో ఒక రోజు అది పూర్తి చేసేయొచ్చు. ఇలా వినోదాయ శితం రీమేక్ కు అన్నీ సెట్ చేసి పెట్టుకున్నారు నిర్మాతలు. ఈ సినిమా అనుకున్నట్టు పూర్తయితే మాత్రం, పవన్ కెరీర్ లోనే రికార్డ్ టైమ్ లో పూర్తయిన చిత్రంగా ఇది చరిత్రలో నిలిచిపోతుంది.
మూవీకి సంబంధించి హీరోయిన్లు, మ్యూజిక్ డైరక్టర్ లాంటివేం అనుకోలేదు. ముందుగా పవన్ పోర్షన్ పూర్తయిన తర్వాత అప్పుడు ఇతర విషయాల గురించి యూనిట్ ఆలోచిస్తుంది.