Telugu Global
NEWS

ఊరూరా తిప్పండి.. బిర్యానీ పెట్టండి..

జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం తెలంగాణకు వస్తున్న బీజేపీ నేతలు హైదరాబాద్ బిర్యానీ తిని, ఇరానీ చాయ్ తాగి వెళ్లాలంటూ సెటైర్లు వేశారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ కి ఎవరైనా రావొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, ఎవ్వరూ అడ్డుచెప్పరు, అలా వచ్చిన వారు మంచిగా బిర్యానీ తిని, ఇరానీ చాయ్ తాగి సంతోషంగా తిరిగెళ్లొచ్చు దానికి కూడా అభ్యంతరం లేదని అన్నారు కేటీఆర్. అదే సమయంలో తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలకు బీజేపీ సిపాయ్ లు వస్తున్నారని వారిని ఊరూరా […]

ఊరూరా తిప్పండి.. బిర్యానీ పెట్టండి..
X

జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం తెలంగాణకు వస్తున్న బీజేపీ నేతలు హైదరాబాద్ బిర్యానీ తిని, ఇరానీ చాయ్ తాగి వెళ్లాలంటూ సెటైర్లు వేశారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ కి ఎవరైనా రావొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, ఎవ్వరూ అడ్డుచెప్పరు, అలా వచ్చిన వారు మంచిగా బిర్యానీ తిని, ఇరానీ చాయ్ తాగి సంతోషంగా తిరిగెళ్లొచ్చు దానికి కూడా అభ్యంతరం లేదని అన్నారు కేటీఆర్. అదే సమయంలో తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలకు బీజేపీ సిపాయ్ లు వస్తున్నారని వారిని ఊరూరా తిప్పించి అభివృద్ధి కార్యక్రమాల వివరాలు చూపించాల్సిన బాధ్యత టీఆర్ఎస్ శ్రేణులకు ఉందని చెప్పారాయన.

రెండురోజుల సర్కస్..
రెండు రోజులపాటు బీజేపీ నేతలు తలపెట్టిన జాతీయ కార్యవర్గాల సమావేశాలను బీజేపీ సర్కస్ గా అభివర్ణించారు కేటీఆర్. నాలుగు బొమ్మలు వేసి, పీకేస్తాం, షో చేస్తాం అంటూ బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారని చెప్పారు కేటీఆర్.

తెలంగాణలోని 119 నియోజకవర్గాలను 119మంది నేతలు వస్తున్నారు. వారంతా మూడురోజులపాటు ఆయా నియోజకవర్గాల్లో మకాం వేస్తారు. అలా వచ్చినవారందర్నీ ఊరికే పంపించొద్దని, ఊరూరా తిప్పించి తమ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూపించాలని చెప్పారు కేటీఆర్.

తెలంగాణ రైతాంగానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24గంటల విద్యుత్ గురించి ఆయా నేతలకు చెప్పాలని, గతంలో మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్ లో కూడా ఇప్పటికీ 24గంటల విద్యుత్ సరఫరా లేదనే విషయాన్ని వారికి వివరించాలన్నారు. మోదీకి దమ్ము, దక్షత ఉంటే.. దేశవ్యాప్తంగా ఇలాగే రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాలన్నారు కేటీఆర్.

ప్రతి ఇంటికీ తీసుకెళ్లి, ఇంటి ముందు ఉన్న నల్లాలు చూపించాలని, బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే.. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలానే మంచినీరు అందించేందుకు కృషి చేయాలని వారికి చెప్పాలన్నారు. రైతు వేదికలు, డంపింగ్ యార్డ్ లు, వైకుంఠ ధామాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలన్నిటినీ ఆయా నాయకులకు చూపించాలని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇలాంటి అభివృద్ధికోసం కృషి చేయాలని వారికి బుద్దొచ్చేలాగా చెప్పాలని సూచించారు కేటీఆర్.

First Published:  1 July 2022 10:44 AM IST
Next Story