తెలంగాణలో పీస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్..
రాష్ట్రాలకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్ని ప్రకటించింది కేంద్రం. భారత్ లో వ్యాపారం చేసుకోడానికి, పెట్టుబడులు పెట్టడానికి ఏ రాష్ట్రం అనుకూలంగా ఉంటుందో మార్కులు ఇచ్చి మరీ ఓ క్లారిటీ ఇచ్చింది కేంద్రం. అయితే తెలంగాణ కేవలం పెట్టుబడులు పెట్టేందుకు కేవలం అనుకూలమైన రాష్ట్రమే కాదని, ప్రశాంతమైన వాతావరణం కూడా ఉన్న రాష్ట్రం అని చెబుతున్నారు కేటీఆర్. తమ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తోపాటు, పీస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి మారుపేరని […]
రాష్ట్రాలకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్ని ప్రకటించింది కేంద్రం. భారత్ లో వ్యాపారం చేసుకోడానికి, పెట్టుబడులు పెట్టడానికి ఏ రాష్ట్రం అనుకూలంగా ఉంటుందో మార్కులు ఇచ్చి మరీ ఓ క్లారిటీ ఇచ్చింది కేంద్రం.
అయితే తెలంగాణ కేవలం పెట్టుబడులు పెట్టేందుకు కేవలం అనుకూలమైన రాష్ట్రమే కాదని, ప్రశాంతమైన వాతావరణం కూడా ఉన్న రాష్ట్రం అని చెబుతున్నారు కేటీఆర్. తమ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తోపాటు, పీస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి మారుపేరని భరోసా ఇచ్చారు.
పారిశ్రామిక, వ్యాపార వర్గాలకు అనుకూల విధానాల రూపకల్పనలో తెలంగాణ ముందు వరుసలో ఉంది. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత తీసుకొచ్చిన ఇండస్ట్రియల్ పాలసీ వ్యాపారవేత్తలకు సాదర స్వాగతం పలికింది. ఇటీవల దావోస్ సదస్సులో కూడా పలు అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి.
టైర్ -2 పట్టణాల్లో నెలకొల్పిన ఐటీ పార్క్ లు కూడా అద్భుతమైన ఫలితాలు అందిస్తున్నాయి. వీటన్నిటి కారణంగా కేంద్రం ప్రకటించిన టాప్ అచీవర్స్ లిస్ట్ లో తెలంగాణ స్థానం సంపాదించింది. అయితే కేవలం కేంద్రం ఇచ్చిన ర్యాంకులే ప్రామాణికం కాదని, తమ రాష్ట్రం అంతకు మించిన పనితనం చూపిస్తోందని చెబుతున్నారు కేటీఆర్.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణకు ర్యాంక్ రావడం సంతోషంగా ఉందన్న కేటీఆర్.. ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా వ్యాపారాలు చేసుకునేందుకు తెలంగాణలో తగిన ఏర్పాట్లు ఉన్నాయని చెప్పారు. పారిశ్రామిక, వ్యాపార వర్గాలకు అనుకూల విధానాలు కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ మరోసారి అగ్రస్థానం అందుకుందని అన్నారు. తమ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కే కాదు.. పీస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు కూడా ప్రాధాన్యతనిస్తోందని చెప్పారాయన.