Telugu Global
MOVIE UPDATES

దసరా షూటింగ్ అప్ డేట్స్

నేచురల్ స్టార్ నాని, కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ‘దసరా‘ షూటింగ్‌ ను పునఃప్రారంభించారు. ఈ భారీ షెడ్యూల్ లో మొత్తం ప్రధాన తారాగణం షూట్‌ లో పాల్గొంటున్నారు. దీనికోసం హైదరాబాద్‌ లో భారీ సెట్‌ వేశారు. ఈ సినిమాలో నాని మునుపెన్నడూ చేయని మాస్ రోల్‌ లో నటిస్తున్నారు. హెయిర్ స్టయిల్, గుబురు గడ్డంతో మాస్ లుక్‌ లో కనిపిస్తున్నాడు. నాని ఈ […]

దసరా షూటింగ్ అప్ డేట్స్
X

నేచురల్ స్టార్ నాని, కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ‘దసరా‘ షూటింగ్‌ ను పునఃప్రారంభించారు. ఈ భారీ షెడ్యూల్ లో మొత్తం ప్రధాన తారాగణం షూట్‌ లో పాల్గొంటున్నారు. దీనికోసం హైదరాబాద్‌ లో భారీ సెట్‌ వేశారు.

ఈ సినిమాలో నాని మునుపెన్నడూ చేయని మాస్ రోల్‌ లో నటిస్తున్నారు. హెయిర్ స్టయిల్, గుబురు గడ్డంతో మాస్ లుక్‌ లో కనిపిస్తున్నాడు. నాని ఈ సినిమాలో తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పడం విశేషం. నాని కెరీర్ లో మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇదే.

తాజాగా విడుదల చేసిన స్టిల్‌లో నాని లుంగీ, బనియన్‌ లో మాస్ అవతార్‌లో కనిపిస్తున్నాడు. కోల్ మైన్ పై నిలబడి బీడీ తాగుతున్న లుక్ ఫుల్ మాసీగా ఉంది. ఫుల్ లెంగ్త్ మాస్, యాక్షన్ ఛాయలతో నాని కనిపిస్తున్న ఈ సినిమా, గోదావరిఖనిలోని సింగరేణి కోల్ మైన్స్‌ దగ్గర ఉన్న ఒక గ్రామం నేపధ్యంలో జరుగుతుంది. జాతీయ అవార్డు విజేత కీర్తి సురేష్ ఈ చిత్రంలో నాని సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

ఇంతకుముందు జరిగిన షెడ్యూల్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ తీశారు. అంతకుముందు నాని, కీర్తి సురేష్‌లపై ఓ పాట చిత్రీకరించారు. ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటు నాటు పాటకు కొరియోగ్రఫీ అందించిన ప్రేమ్ రక్షిత్, 500 మంది డ్యాన్సర్లతో ఈ పాటని అద్భుతంగా కంపోజ్ చేశాడు.

సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో కనిపించనున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నాడు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారు.

First Published:  1 July 2022 12:15 PM IST
Next Story