Telugu Global
NEWS

దేశాన్ని ఎన్నిసార్లు ఫూల్ ని చేస్తారు మోదీజీ..

రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదీ ముర్ము విజయం కోసం బీజేపీ ప్రయత్నిస్తుండగా.. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా గెలుపుకోసం టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్.. ఢిల్లీ వేదికగా బీజేపీకి సవాళ్లు విసిరారు. తాజాగా ఆయన ట్విట్టర్లో మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. దేశాన్ని ఎన్నిసార్లు ఫూల్ ని చేస్తారు మోదీజీ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు కేటీఆర్. సూటిగా, సుత్తి […]

దేశాన్ని ఎన్నిసార్లు ఫూల్ ని చేస్తారు మోదీజీ..
X

రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదీ ముర్ము విజయం కోసం బీజేపీ ప్రయత్నిస్తుండగా.. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా గెలుపుకోసం టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్.. ఢిల్లీ వేదికగా బీజేపీకి సవాళ్లు విసిరారు. తాజాగా ఆయన ట్విట్టర్లో మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. దేశాన్ని ఎన్నిసార్లు ఫూల్ ని చేస్తారు మోదీజీ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు కేటీఆర్.

సూటిగా, సుత్తి లేకుండా.. విమర్శల ఘాటు తప్ప, అసభ్య పదాలేవీ లేకుండా ట్వీట్లు వేయడంలో కేటీఆర్ దిట్ట. ఈసారి కూడా ఆయన మోదీపై వేసిన ట్వీట్.. బీజేపీని ఇబ్బందుల్లో పడేసింది.

కొత్తగా విమర్శ చేయలేదు కానీ, గతంలో మోదీ ఏం చెప్పారు, ఇప్పుడు ఏం జరుగుతోంది.. అని పోలిక మాత్రమే చెప్పి మిగతా వ్యవహారాన్ని ప్రజలకే వదిలేశారు కేటీఆర్. దేశంలో గ్రామాలకు విద్యుత్ సరఫరా ఎలా జరుగుతోందనే విషయాన్ని సెటైరిక్ గా చెప్పారు కేటీఆర్.

2018లోనే భారత్ లోని గ్రామాలన్నిటికీ విద్యుత్ సౌకర్యం కల్పించామని మోదీ గొప్పగా చెప్పుకున్నారు. ఆ విషయాన్ని కోట్ చేస్తూ.. ప్రస్తుతం ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము సొంత గ్రామానికి కరెంట్ లైన్లు వేస్తున్నారన్న కథనాన్ని జత చేశారు కేటీఆర్. 2018లో మోదీ చెప్పిన మాట, 2022 జూన్ 25కి కూడా నిజం కాలేకపోయిందని విమర్శించారు కేటీఆర్.

‘అబద్ధాలు, పచ్చి అబద్ధాలు.. ఇవి బీజేపీ మార్క్‌ అబద్ధాలు..’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. 2018లో మోదీ వ్యాఖ్యలపై వచ్చిన కథనం, తాజాగా ద్రౌపదీ ముర్ము గ్రామానికి కరెంటు సరఫరాపై వచ్చిన కథనాలను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇంకెన్నిసార్లు దేశాన్ని ఫూల్ చేస్తారు మోదీజీ అని ప్రశ్నించారు. దీనికి బీజేపీ నుంచి వచ్చే కౌంటర్లు కూడా ఏమీ ఉండకపోవచ్చు.

ద్రౌపదీ ముర్ము గ్రామానికి అసలు కరెంటే లేకపోవడం పరువు తక్కువ వ్యవహారం కావడంతో బీజేపీ వెంటనే ఆ పనిచేయించింది. కానీ ఇప్పుడు మరో రకంగా ఇలా విమర్శలు ఎదుర్కొంటోంది. హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఆల్రడీ మాటల తూటాలు పేలుతున్నాయి. ఫ్లెక్సీ వార్ మొదలైంది. తాజాగా ఇప్పుడు కేటీఆర్ చేసిన ట్వీట్ బీజేపీని మరింత ఇరుకున పెట్టేలా ఉంది.

First Published:  30 Jun 2022 8:40 AM IST
Next Story