Telugu Global
NEWS

అటు చేరికలు.. ఇటు గ్రూపు రాజకియాలు

తెలంగాణ కాంగ్రెస్ లో ఇటీవల చేరికల జోష్ పెరిగింది. ఇతర పార్టీలనుంచి వచ్చే వలస నేతలకు కండువాలు కప్పేస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు సంబరపడిపోతున్నారు. ఎన్నికలకింకా ఏడాదే టైమ్ ఉన్న ఈ సందర్భంలో ఈ చేరికలతో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని అంచనా వేస్తున్నారు. చేరికల సంగతేమో కానీ.. కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఎవరికి వారే యమునా తీరే.. ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం అగ్నిపథ్ వ్యతిరేక నిరసనలకు పిలుపునిచ్చింది. అంతకు ముందు రైతు […]

Telangana congress
X

తెలంగాణ కాంగ్రెస్ లో ఇటీవల చేరికల జోష్ పెరిగింది. ఇతర పార్టీలనుంచి వచ్చే వలస నేతలకు కండువాలు కప్పేస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు సంబరపడిపోతున్నారు. ఎన్నికలకింకా ఏడాదే టైమ్ ఉన్న ఈ సందర్భంలో ఈ చేరికలతో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని అంచనా వేస్తున్నారు. చేరికల సంగతేమో కానీ.. కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి.

ఎవరికి వారే యమునా తీరే..
ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం అగ్నిపథ్ వ్యతిరేక నిరసనలకు పిలుపునిచ్చింది. అంతకు ముందు రైతు రచ్చబండ కార్యక్రమాలు మొదలు పెట్టింది. అయితే మండలాలు, నియోజకవర్గాల్లో కాంగ్రెస్ లోని రెండు గ్రూపులు విడివిడిగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుండటం విశేషం.

దాదాపు అన్ని చోట్లా ఈ పరిస్థితి ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ గెలిచిన ఏకైక సీటు ఎల్లారెడ్డి. అక్కడ హస్తం గుర్తుపై గెలిచిన సురేందర్ ఆ తర్వాతి కాలంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కానీ అక్కడ స్థానికంగా కాంగ్రెస్ కి మంచి కేడర్ ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో కూడా ఆ స్థానం నుంచి గెలవాలని కాంగ్రెస్ నాయకులు పథక రచన చేస్తున్నారు.

పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, పీసీసీ ఐటీసెల్ చైర్మన్ మదన్ మోహన్ రావు.. ఇద్దరూ ఆ సీటుపై ఫోకస్ పెట్టారు. సుభాష్ రెడ్డికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలున్నాయి. ఇక మదన్ మోహన్ రావుకి డైరెక్ట్ గా ఏఐసీసీ ఆశీస్సులున్నాయని అంటారు. రాహుల్ గాంధీతో ఆయనకు పరిచయాలున్నాయి. రేవంత్ వ్యతిరేక వర్గం కూడా మదన్ మోహన్ రావుకి సపోర్ట్ ఇస్తోంది. దీంతో ఆయన కూడా ఎల్లారెడ్డిలో పట్టుకోసం చూస్తున్నారు.

2019 పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన మదన్ మోహన్ రావు, ఇప్పుడు ఎల్లారెడ్డి అసెంబ్లీ సీటు కావాలంటున్నారు. ముందుగానే అక్కడ కార్యకర్తలతో కలసి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయనకి పోటీగా సుభాష్ రెడ్డి కూడా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి మండలంలోనూ వీరిద్దరికీ వర్గాలున్నాయి. అందరూ కాంగ్రెస్ నేతలే అయినా, అందులోనూ రెండు వర్గాలుండటం విశేషం.

నెలరోజుల క్రితం లింగంపేట మండలంలో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. నాలుగురోజుల క్రితం రాజంపేట మండలం ఎల్లారెడ్డి పేట తండాలో మరోసారి డైరెక్ట్ ఫైట్ జరిగింది. అంతకు ముందు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సభకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే విషయంలో కూడా ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. దీనిపై పోలీస్ కేసులు కూడా పెట్టుకున్నారు.

ఆ తర్వాత గాంధీ భవన్ లో ఇరు వర్గాలు ఫిర్యాదు చేశాయి. మరి రేవంత్ రెడ్డి అండదండలున్న సుభాష్ రెడ్డి పట్టు నిలుపుకుంటారా, లేక డైరెక్ట్ గా అధిష్టానంతోటే టచ్ లో ఉన్న మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి టికెట్ సంపాదిస్తారా అనేది వేచి చూడాలి. ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చినా.. రెండో వర్గం కచ్చితంగా రెబల్ గా మారే అవకాశముంది. ఓవైపు చేరికలతో సంబరపడుతున్న అధిష్టానానికి ఈ గ్రూపు రాజకీయాలు చికాకు పెడుతున్నాయి.

First Published:  30 Jun 2022 6:32 AM IST
Next Story