Telugu Global
National

టైలర్ హత్య: ప్రజ‌లను రెచ్చగొడితే ఓట్లు పడతాయా ?

అధికార దాహంతో రాష్ట్రాల‌న్నింటిలో విస్త‌రించాల‌ని చూస్తున్న భార‌తీయ జ‌న‌తా పార్టీ(బిజెపి) తాజాగా రాజ‌స్తాన్ పై దృష్టి పెట్టింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఆ రాష్ట్రంలో వ‌చ్చే యేడాది అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అందుకోసం బిజెపి ముందుగానే ప్లాన్ రెడీ చేసుకుంటోంది. ఇటీవ‌ల ఉద‌య్ పూర్ లో టైల‌ర్ క‌న్హ‌య్యాలాల్ హ‌త్య‌ను పావుగా వాడుకోవాల‌నుకుంటోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ప్రచారాన్ని ప్రారంభించేందుకు బిజెపి సిద్ధమవుతోంది. ఈ హ‌త్యోదంతంపై రాష్ట్ర ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ […]

టైలర్ హత్య: ప్రజ‌లను రెచ్చగొడితే ఓట్లు పడతాయా ?
X

అధికార దాహంతో రాష్ట్రాల‌న్నింటిలో విస్త‌రించాల‌ని చూస్తున్న భార‌తీయ జ‌న‌తా పార్టీ(బిజెపి) తాజాగా రాజ‌స్తాన్ పై దృష్టి పెట్టింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఆ రాష్ట్రంలో వ‌చ్చే యేడాది అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అందుకోసం బిజెపి ముందుగానే ప్లాన్ రెడీ చేసుకుంటోంది. ఇటీవ‌ల ఉద‌య్ పూర్ లో టైల‌ర్ క‌న్హ‌య్యాలాల్ హ‌త్య‌ను పావుగా వాడుకోవాల‌నుకుంటోంది.

కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ప్రచారాన్ని ప్రారంభించేందుకు బిజెపి సిద్ధమవుతోంది. ఈ హ‌త్యోదంతంపై రాష్ట్ర ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై వ్య‌తిరేక‌త పెంచేందుకు ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇప్ప‌టికే రాష్ట్ర‌ శాఖ‌ను కేంద్ర అధినాయ‌క‌త్త్వం ఈ ఘ‌ట‌న‌పై నివేదిక కోరింది. రాష్ట్రంలో మ‌త‌ప‌ర‌మైన ఘ‌ర్ష‌ణ‌ల జాబితాను రూపొందించి ప్ర‌భుత్వాన్ని అప్ర‌దిష్ట పాలు జేయాల‌నే ఆలోచిస్తోంది. ఇందుకు అక్క‌డి నాయ‌కులు చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు, ప్ర‌య‌త్నాలు ఉద‌హ‌ర‌ణ‌గా నిలుస్తున్నాయి.

ఉదయపూర్ హత్య “అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల”తో ముడిపడి ఉన్న “పెద్ద కుట్ర”లో భాగమని బిజెపి పేర్కొంది.

వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో ‘హిందువులపై మతపరమైన హింసే ప్రధాన ఎజెండా’ అని బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. “ముఖ్య‌మంత్రి గెహ్లాట్ శాంతి సామ‌ర‌స్యాల గురించి ఉప‌న్యాసాలు దంచుతాడు కానీ వాస్త‌వంలో ఆయ‌న హిందు-ముసిం రాజ‌కీయాల్లోనే మునిగిపోతాడని బిజెపి నాయ‌కులు విమ‌ర్శిస్తున్నారు.

రామ్ నవమి సమయంలో, అతను జూలూలను (ఊరేగింపు) నిషేధించాడు, అయితే అదే సమయంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) ర్యాలీకి అనుమతి ఇచ్చాడు. ఇలాంటి ఘటనలు హిందూ సమాజానికి తప్పుడు సందేశాలు అందజేస్తున్నాయ‌ని” రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సతీష్ పూనియా అన్నారు.

“ఈ దాడి కన్హయ్య లాల్ పై మాత్రమే కాదు, మొత్తం హిందూ సమాజానికి వ్యతిరేకంగా జ‌రిగింది. ఈ ధోరణి ఆపకపోతే, రాజస్థాన్ ప్రజలు 2023 ఎన్నికల్లో ఈ ప్ర‌భుత్వాన్ని ఇంటికి సాగ‌నంప‌డం ఖాయం.” అని పూనియా అన్నారు.

ఉదయపూర్ సంఘటనను “ఉగ్రవాద దాడి” అని బిజెపి అధికార ప్రతినిధి, జైపూర్ రూరల్ పార్లమెంటు సభ్యుడు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ అభివర్ణించారు, ముఖ్యమంత్రి దీనిని “మరో ర‌క‌మైన హత్యగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ” అని అన్నారు. “రాజస్థాన్‌లో గత కొన్ని సంవత్సరాలుగా శాంతిభద్రతలు క్షీణించాయి. హిందూ సమాజంపై మతపరమైన హింస పెరుగుతోంది” అని అన్నారు. గెహ్లాట్ రాజీనామా చేయాలని ఆయ‌న డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో హిందూ సమాజానికి ఎటువంటి ర‌క్ష‌ణ లేద‌ని, వారి బ‌తుకులు ఇకపై సురక్షితంగా లేవ‌నే విషయాన్ని హైలైట్ చేయడానికి “సామాజిక మాద్య‌మాల‌ను ఉప‌యోగించుకోవాల‌ని పార్టీ ప్లాన్ చేస్తోంద‌న్నారు.

“ఈ ప్రత్యేక సంఘటనతో పాటు గత కొన్నేళ్లుగా జరిగిన అన్ని విషయాలను సీరియ‌స్‌ గా ప‌రిగ‌ణిస్తున్నాం. ఇది ఒక హిందూ వ్యక్తిపై మూకుమ్మడి దాడి చేయ‌డ‌మేన‌ని ఆయ‌న అన్నారు. ఈ దారుణాల‌పై ప్ర‌జా సంఘాలు ఏమైనా ఉద్య‌మం చేస్తే వారికి మా మ‌ద్ద‌తు త‌ప్ప‌క ఉంటుంద‌ని పూనియా చెప్పారు. అంటే ప‌రోక్షంగా ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టి ఉద్య‌మాలు చేయించి వాటి వెన‌క‌ ఉండి న‌డిపించాల‌ని బిజెపి ప్లాన్ గా క‌న‌బ‌డుతోంద‌ని ఓ సామాజిక కార్య‌క‌ర్త అభిప్రాయ‌ప‌డ్డారు.

First Published:  30 Jun 2022 10:21 AM IST
Next Story