అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ పంజాబ్ అసెంబ్లీ తీర్మానం
కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ గురువారం పంజాబ్ అసెంబ్లీ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ స్కీంని తక్షణమే ఉపసంహరించుకునేలా దీన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలని సభ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. భారత ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పంజాబ్ సహా అనేక రాష్ట్రాల్లో పెద్దఎత్తున ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు జరిగాయని, ఈ కారణంగా ఈ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని తీర్మానంలో కోరారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్వయంగా ఈ తీర్మానాన్ని చదివారు. […]
కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ గురువారం పంజాబ్ అసెంబ్లీ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ స్కీంని తక్షణమే ఉపసంహరించుకునేలా దీన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలని సభ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
భారత ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పంజాబ్ సహా అనేక రాష్ట్రాల్లో పెద్దఎత్తున ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు జరిగాయని, ఈ కారణంగా ఈ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని తీర్మానంలో కోరారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్వయంగా ఈ తీర్మానాన్ని చదివారు. ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు..అశ్వినీ శర్మ, జంగీ లాల్ మహాజన్ దీన్ని వ్యతిరేకించారు.
తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొన్న మాన్.. తమ తీర్మాన విషయాన్ని త్వరలో ప్రధాని, కేంద్ర హోం మంత్రి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. ఈ పథకం దేశ యువతకు పూర్తిగా వ్యతిరేకమని, దేశంలో అనేక చోట్ల జరిగిన నిరసనలే ఇందుకు నిదర్శనమని అన్నారు.
ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతాప్ సింగ్ బాజ్వా, అకాలీదళ్ సభ్యుడు మన్ ప్రీత్ సింగ్ అయాలీ తదితరులు ఈ తీర్మానాన్ని సమర్థించారు. అగ్నిపథ్ పథకాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దేశ సాయుధ దళాల్లో పంజాబ్ నుంచి లక్షమందికి పైగా సైనికులు ఉన్నారని, వీరిలో అనేకమంది దేశ రక్షణ కోసం ప్రతి ఏడాదీ తమ జీవితాలను త్యాగం చేస్తున్నారని మాన్ అన్నారు. సైన్యంలో పని చేయడాన్ని తమకొక గర్వ కారణంగా ఈ రాష్ట్ర యువత భావిస్తున్నారని ఆయన చెప్పారు. కానీ రెగ్యులర్ సైనికులుగా ఆర్మీలో చేరదలచిన వీరి కలలను ఈ పథకం చిన్నాభిన్నం చేసిందన్నారు. పైగా సాయుధ దళాల స్పిరిట్ ని కూడా ఇది దెబ్బ తీసేవిధంగా ఉందని మాన్ ఆరోపించారు. ఈ పథకానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం ప్రతిపాదించి ఆమోదిస్తామని ఆయన ఈ నెల 28 న ప్రకటించారు.