Telugu Global
MOVIE UPDATES

ఓటీటీ రిలీజ్ : 50 రోజుల నిబంధన హుష్ కాకేనా!

ఇటీవల చిన్న చిత్రాలు పెద్ద చిత్రాలు అనే తేడా లేకుండా థియేటర్లలో విడుదలైన రెండు వారాలు, మూడు వారాల్లోపే ఓటీటీలో విడుదలవుతున్నాయి. ఆచార్య, సర్కారు వారిపాట వంటి భారీ సినిమాలు విడుదలైన 20 రోజుల్లోగానే ఓటీటీలోకి వచ్చేశాయి. పుష్ప, అఖండ, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్- 2 వంటి చిత్రాలు విడుదలైన నెల రోజుల తర్వాత థియేట్రికల్ కొనసాగుతున్న సమయంలోనే ఓటీటీలో విడుదల అయ్యాయి. ఆ తర్వాత కూడా ఈ సినిమాలు కొద్ది రోజులపాటు థియేటర్లలో ప్రదర్శితమయ్యాయి. అయితే థియేటర్లలో […]

OTT
X

ఇటీవల చిన్న చిత్రాలు పెద్ద చిత్రాలు అనే తేడా లేకుండా థియేటర్లలో విడుదలైన రెండు వారాలు, మూడు వారాల్లోపే ఓటీటీలో విడుదలవుతున్నాయి. ఆచార్య, సర్కారు వారిపాట వంటి భారీ సినిమాలు విడుదలైన 20 రోజుల్లోగానే ఓటీటీలోకి వచ్చేశాయి. పుష్ప, అఖండ, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్- 2 వంటి చిత్రాలు విడుదలైన నెల రోజుల తర్వాత థియేట్రికల్ కొనసాగుతున్న సమయంలోనే ఓటీటీలో విడుదల అయ్యాయి. ఆ తర్వాత కూడా ఈ సినిమాలు కొద్ది రోజులపాటు థియేటర్లలో ప్రదర్శితమయ్యాయి.

అయితే థియేటర్లలో సినిమా ఉన్న సమయంలోనే ఓటీటీలోకి వస్తుండడంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పటిదాకా ఉన్న కలెక్షన్స్ అకస్మాత్తుగా తగ్గిపోతున్నాయని వాపోతున్నారు. ప్రేక్షకులు కూడా కొత్త సినిమాలు విడుదలైతే థియేటర్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. రెండు మూడు వారాలు ఆగితే నేరుగా ఓటీటీలో విడుదల అవుతాయని అంచనాకు వస్తున్నారు. దీంతో ఇటీవల విడుదలైన పలు సినిమాలు బాగున్నప్పటికీ సరైన వసూళ్లు దక్కలేదు.

ఈ విషయమై నిన్న తెలుగు ఫిల్మ్ మేకర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ సమావేశమయ్యారు. థియేటర్లలో విడుదలైన యాభై రోజుల తర్వాతే సినిమాలను ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించారు. సినీ పెద్దలు తీసుకున్న నిర్ణయం ప్రకారం థియేటర్లలో విడుదలైన కొత్త సినిమా ఓటీటీలో 50 రోజుల తర్వాతే స్ట్రీమింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే సినీ పెద్దలు తీసుకున్న నిర్ణయం ఎంత మేరకు అమల్లో ఉంటుందన్నది సందేహాస్పదంగా మారింది.

ఎందుకంటే నిన్న సినీ పెద్దలు కొత్త సినిమాలు ఓటీటీలోకి వచ్చేది ఇక 50 రోజుల తర్వాతే అని నిర్ణయించిన కొద్దిసేపటికే విరాట పర్వం ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేశారు. ఈ సినిమా కేవలం విడుదలైన పదిహేను రోజుల్లోపే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇందుకు సంబంధించి అఫీషియల్ ప్రకటన కూడా వచ్చింది.

సినీ పెద్దలు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం వెలువడిన నిమిషాల్లోనే విరాట పర్వం సినిమా 50 రోజుల నిబంధనను పక్కనపెట్టి ఓటీటీలోకి రావడం ఆశ్చర్యం గా మారింది. జూన్ 17 వ తేదీన విడుదలైన ఈ సినిమా జులై 1వ తేదీన ఓటీటీలో విడుదల అవుతోంది. నిబంధనలు పక్కనపెట్టి విరాటపర్వం ఓటీటీలో విడుదల అవుతుండటంతో ఇకపై ముందు ముందు సినీ పెద్దలు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఎంత వరకు అమల్లో ఉంటుందన్నది సందేహాస్పదంగా మారింది.

First Published:  30 Jun 2022 9:17 AM IST
Next Story