మహారాష్ట్ర సీఎంగా ఏక్ నాథ్ పేరును ప్రకటించిన దేవేంద్ర ఫడ్నవిస్
మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ ! ఇప్పటివరకు కాబోయే సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ అని వార్తలు రాగా.. అనూహ్యంగా తాను కానని, ఏక్ నాథ్ షిండే నూతన ముఖ్యమంత్రి అని ఫడ్నవీస్ ప్రకటించారు. ఈ రోజు షిండే ఒక్కరే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా ఆయన చెప్పారు. షిండే ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. గురువారం రాత్రి ఏడున్నర గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. . […]
మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ ! ఇప్పటివరకు కాబోయే సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ అని వార్తలు రాగా.. అనూహ్యంగా తాను కానని, ఏక్ నాథ్ షిండే నూతన ముఖ్యమంత్రి అని ఫడ్నవీస్ ప్రకటించారు. ఈ రోజు షిండే ఒక్కరే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా ఆయన చెప్పారు.
షిండే ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. గురువారం రాత్రి ఏడున్నర గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. . ఎవరూ ఊహించని విధంగా ఫడ్నవీస్ ఈ ప్రకటన చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
షిండేతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన.. షిండే ప్రమాణ స్వీకారం తరువాత కేబినెట్ విస్తరణ ఉంటుందని, బాలా సాహెబ్ ఆశయాలను షిండే ముందుకు తీసుకువెళ్తారని వెల్లడించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తరువాత ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన ఎన్సీపీతోను, కాంగ్రెస్ పార్టీతోనూ చేతులు కలిపి అపవిత్ర కూటమిని ఏర్పాటు చేసిందని ఫడ్నవీస్ ఆరోపించారు. తాను మంత్రివర్గంలో ఉండనని, కానీ ప్రభుత్వం సజావుగా సాగేలా చూస్తానని ఫడ్నవీస్ చెప్పారు.
మొదట గవర్నర్ కోష్యారీని ఫడ్నవీస్, షిండే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమను ఆహ్వానించవలసిందిగా కోరారు. అనంతరం రాజ్ భవన్ లోనే మీడియాతో మాట్లాడారు. సీఎం పదవికి తనను ఖరారు చేసినందుకు షిండే.. ఫడ్నవీస్ కి కృతజ్ఞతలు తెలిపారు.
ఫడ్నవీస్ విశాల హృదయుడని, తమకు సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలని ఆయన అన్నారు. గత రెండున్నర ఏళ్లుగా ఏం జరిగిందో ఫడ్నవీస్ చెప్పారని, తమ కృషి నిలిచిపోయిందని ఆయన చెప్పారు.
సేన-బీజేపీ కూటమి సహజంగా ఏర్పడిందేనని, కానీ మహావికాస్ అఘాడీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలెవరూ సంతోషంగా లేరని ఆయన అన్నారు. స్వార్థ ప్రయోజనాలతో ఎవరూ తమ వర్గంలో చేరలేదన్నారు. ప్రజల మనోభావాలను గుర్తించే ఈ నిర్ణయం( బీజేపీతో కూటమి నిర్ణయం) తీసుకున్నామని చెప్పారు.
పెద్ద పార్టీ అయినా బీజేపీ తమకు మద్దతునిచ్చిందన్నారు. ప్రధాని మోడీకి కూడా షిండే కృతజ్ఞతలు తెలియజేస్తూ .. ఇంత పెద్ద పార్టీ తనను ముఖ్యమంత్రిని చేసిందని, ఎవరు ఈ పని చేయగలిగారని ప్రశ్నించారు.