Telugu Global
National

‘నాడు విర్రవీగావ్.. నా ఇంటిని కూల్చావ్.. నేడేమయింది..?’ ఉద్ధవ్ పై ఉరిమిన కంగనా

‘జబ్ పాప్ బడ్ జాతా హై.. ‘ (పాపాలు పెరిగిపోయినప్పుడు) .. ఇలాగే జరుగుతుంది అని మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వ పతనంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వ్యాఖ్యానించింది. ఓ నిముషం నిడివి గల తన వీడియోలో ఉద్ధవ్ ‘అధికార గర్వాన్ని’ ఉతికారేసింది. థాక్రే రాజీనామాపై ఆమె ప్రతిస్పందిస్తూ.. ‘సత్తాకా ఘమండ్’ నీరు గారిపోయిందని పేర్కొంది. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభాన్ని ఆమె 1975 నాటి సోషలిస్టు జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమంతో పోల్చుతూ ఇన్నాళ్లకు ఈ తరుణం.. […]

‘నాడు విర్రవీగావ్.. నా ఇంటిని కూల్చావ్.. నేడేమయింది..?’ ఉద్ధవ్ పై ఉరిమిన కంగనా
X

‘జబ్ పాప్ బడ్ జాతా హై.. ‘ (పాపాలు పెరిగిపోయినప్పుడు) .. ఇలాగే జరుగుతుంది అని మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వ పతనంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వ్యాఖ్యానించింది. ఓ నిముషం నిడివి గల తన వీడియోలో ఉద్ధవ్ ‘అధికార గర్వాన్ని’ ఉతికారేసింది.

థాక్రే రాజీనామాపై ఆమె ప్రతిస్పందిస్తూ.. ‘సత్తాకా ఘమండ్’ నీరు గారిపోయిందని పేర్కొంది. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభాన్ని ఆమె 1975 నాటి సోషలిస్టు జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమంతో పోల్చుతూ ఇన్నాళ్లకు ఈ తరుణం.. భారత ప్రజాస్వామ్యంలో ముఖ్యమైనదిగా మారిందని ట్వీట్ చేసింది.

‘2020 లో నేనేమన్నాను ? ప్రజాస్వామ్యమన్నది ఒక నమ్మకమని, ఈ నమ్మకాన్ని అధికార గర్వంతో అణచాలని చూస్తే ఏదో ఒక రోజున ఆ గర్వం కూడా అణగిపోతుంది అన్నాను.. ఇప్పుడేమైంది? అని కంగనా ప్రశ్నించింది.

హనుమాన్ చాలీసాపై నిషేధం విధిస్తారా? హనుమాన్ ఎవరు ? శివుడి 12 వ అవతారమంటారు.. హనుమాన్ చాలీసాను బ్యాన్ చేయాలని శివసేన నిర్ణయించినప్పుడు శివుడు కూడా వారిని కాపాడలేడు.. అని కంగనా ఖస్సుమంది.. రాష్ట్రంలో మళ్ళీ బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడనున్న తరుణాన్ని ఆమె ప్రస్తావిస్తూ .. పాపాలు పెరిగిపోయినప్పుడు వినాశనం సంభవిస్తుందని, అనంతరం ఓ సృష్టి ఏర్పడి జీవిత కమల రేకులు వికసిస్తాయని అభివర్ణించింది.

రాష్ట్రంలో శివసేన పతనం తప్పదని 2020 లోనే తాను జోస్యం చెప్పానని, అది ఇప్పుడు నిజమైందని కంగనా రనౌత్ పేర్కొంది. ఆ నాడు బాలీవుడ్ మాఫియాతో చేతులు కలిపి తన ఇంటిని కూల్చివేసి తనపై పగ తీర్చుకున్నారని, దానికి ప్రస్తుతం ఏం జరిగిందో తెలుస్తూనే ఉందని ఆమె వ్యాఖ్యానించింది.

సమయం అన్నది ఎప్పుడూ ఒకేలా ఉండదని కంగనా ..ఉద్ధవ్ థాక్రేని చెడామడా తిట్టినంత పని చేసింది. ముంబైని పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పోలుస్తూ ఆ నాడు ఈమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ వ్యాఖ్యలకు నిరసనగా శివసేన ఆందోళన చేయడం, ఉద్ధవ్ ప్రభుత్వ ఆదేశాలతో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఈమె ఇంటిని కూల్చివేయడం,. దాన్ని సవాలు చేస్తూ ఈమె కోర్టుకెక్కడం అంతా పెను సంచలనమైంది.

First Published:  30 Jun 2022 10:26 AM IST
Next Story