Telugu Global
NEWS

ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు

ఏపీఎస్ఆర్టీసీ బస్ చార్జీలు పెంచింది. నేరుగా చార్జీలు పెంచామని చెప్పకుండా డీజిల్ సెస్ పెంచుతున్నట్టు ప్రకటించారు అధికారులు. శుక్రవారం నుంచి పెరిగిన చార్జీలు అమలులోకి వస్తాయి. సిటీ బస్ సర్వీస్ లకు మాత్రం ఇందులో మినహాయింపు ఇచ్చారు. మిగతా సర్వీసులన్నిటికీ టికెట్ చార్జీల పెంపు వర్తిస్తుంది. కరోనా తర్వాత ఇటీవలే ఏపీఎస్ఆర్టీసీ చార్జీలు పెంచింది. అటు తెలంగాణలో మాత్రం రెండుసార్లు చార్జీలు పెరిగాయి. ఇప్పుడు ఏపీలో కూడా రెండోసారి డీజిల్ సెస్ రూపంలో ప్రయాణికులపై భారం మోపేందుకు […]

APSRTC
X

ఏపీఎస్ఆర్టీసీ బస్ చార్జీలు పెంచింది. నేరుగా చార్జీలు పెంచామని చెప్పకుండా డీజిల్ సెస్ పెంచుతున్నట్టు ప్రకటించారు అధికారులు. శుక్రవారం నుంచి పెరిగిన చార్జీలు అమలులోకి వస్తాయి. సిటీ బస్ సర్వీస్ లకు మాత్రం ఇందులో మినహాయింపు ఇచ్చారు. మిగతా సర్వీసులన్నిటికీ టికెట్ చార్జీల పెంపు వర్తిస్తుంది.

కరోనా తర్వాత ఇటీవలే ఏపీఎస్ఆర్టీసీ చార్జీలు పెంచింది. అటు తెలంగాణలో మాత్రం రెండుసార్లు చార్జీలు పెరిగాయి. ఇప్పుడు ఏపీలో కూడా రెండోసారి డీజిల్ సెస్ రూపంలో ప్రయాణికులపై భారం మోపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. అయితే ఈసారి స్వల్పంగానే చార్జీలు పెరుగుతాయని, బస్ పాస్ ల విషయంలో కూడా స్వల్ప పెరుగుదల ఉంటుందని తెలిపారు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు.

పెరుగుతున్న డీజల్ ధరల కారణంగా ఆర్టీసీకి ప్రతి రోజు రెండున్నర కోట్ల రూపాయల అధిక భారం పడుతోందని వివరించారు అధికారులు.

బస్సుల నిర్వహణ కూడా భారంగా మారిందని, టైర్లు, స్పేర్ పార్టుల ధరలు పెరిగాయని అయితే ఇది ప్రయాణికులపై వేసే భారం కాదని చెప్పారు అధికారులు. అందుకే అత్యవసరమైన డీజిల్ సెస్ మాత్రమే పెంచామని చెప్పారు. స్లాబ్ పద్ధతిలో కిలోమీటర్ల ఆధారంగా డీజల్ సెస్సు విధిస్తున్నారు.

పెంపు ఇలా..

పల్లెవెలుగులో ప్రస్తుతం కనీస ఛార్జీ రూ.10 ఉండగా.. 35-60 కి.మీకు అదనంగా మరో 5 రూపాయలు చార్జీ పెరుగుతుంది. 60-70కి.మీకు 10 రూపాయల డీజిల్ సెస్ విధిస్తారు.

ఎక్స్‌ ప్రెస్, మెట్రో, మెట్రో డీలక్స్ బస్సుల్లో టికెట్‌ పై ఇప్పటి వరకూ 5 రూపాయల డీజిల్ సెస్ ఉండగా.. ఎక్స్‌ ప్రెస్ లలో 31-65 కి.మీ వరకు మరో 5 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. 66-80 కి.మీ వరకు టికెట్ పై డీజిల్ సెస్ 10 రూపాయలు విధిస్తున్నారు.

హైదరాబాద్‌ వెళ్లే సూపర్ లగ్జరీ బస్సుల్లో టికెట్ పై 70 రూపాయల డీజిల్ సెస్, అమరావతి బస్సుల్లో 80 రూపాయల డీజిల్ సెస్ విధిస్తున్నారు.

First Published:  30 Jun 2022 3:35 PM IST
Next Story