సత్యసాయి జిల్లాలో ఘోరం… 5 మంది కూలీలు సజీవదహనం
ఆంధ్రప్రదెశ్ లోని సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. 5 మంది కూలీలు సజీవదహనం అయ్యారు. తాడిమర్రి మండలం గుడ్డంపల్లికి చెందిన వ్యవసాయ కూలీలు కూలీ పనుల కోసం ఈ రోజు ఉదయాన్నే చిల్లకొండయ్యపల్లికి ట్రాలీ ఆటోలో బయలు దేరారు. చిల్లకొండయ్యపల్లి కి చేరుకునే సమయంలో ఆటో పై హైటెన్షన్ కరెంట్ తీగలు తెగిపడిపోయాయి. దాంతో ఒక్క సారిగా ఆటోకు మంటలు అంటుకున్నాయి. ఆసమయంలో ఆటో ట్రాలీ లో ఉన్న 5 మంది కూలీలు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. […]

ఆంధ్రప్రదెశ్ లోని సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. 5 మంది కూలీలు సజీవదహనం అయ్యారు.
తాడిమర్రి మండలం గుడ్డంపల్లికి చెందిన వ్యవసాయ కూలీలు కూలీ పనుల కోసం ఈ రోజు ఉదయాన్నే చిల్లకొండయ్యపల్లికి ట్రాలీ ఆటోలో బయలు దేరారు. చిల్లకొండయ్యపల్లి కి చేరుకునే సమయంలో ఆటో పై
హైటెన్షన్ కరెంట్ తీగలు తెగిపడిపోయాయి.
దాంతో ఒక్క సారిగా ఆటోకు మంటలు అంటుకున్నాయి. ఆసమయంలో ఆటో ట్రాలీ లో ఉన్న 5 మంది కూలీలు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. ప్రమాదంలో మృతి చెందినవారంతా గుడ్డంపల్లివాసులుగా గుర్తించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.