ఆస్కార్ మెంబర్ షిప్ దక్కించుకున్న సూర్య
హీరో సూర్య మరో అరుదైన ఘనత దక్కించుకున్నాడు. 2022 సంవత్సరానికి గాను అతడు ఆస్కార్ మెంబర్ షిప్ దక్కించుకున్నాడు. ఈ ఏడాది ఇండియా నుంచి ఆస్కార్ మెంబర్ షిప్ దక్కించుకున్న వ్యక్తులు ఇద్దరే. వాళ్లలో ఒకరు కాజోల్ కాగా, మరొకరు సూర్య. సౌత్ నుంచి ఈ ఘనత అందుకున్న తొలి నటుడిగా సూర్య గుర్తింపు పొందాడు. ఏటా కొంతమంది వ్యక్తులకు మెంబర్ షిప్ అందిస్తుంది ఆస్కార్ జ్యూరీ. ఇందులో మెంబర్ షిప్ పొందాలంటే సదరు నటీనటులు లేదా […]
హీరో సూర్య మరో అరుదైన ఘనత దక్కించుకున్నాడు. 2022 సంవత్సరానికి గాను అతడు ఆస్కార్ మెంబర్ షిప్ దక్కించుకున్నాడు. ఈ ఏడాది ఇండియా నుంచి ఆస్కార్ మెంబర్ షిప్ దక్కించుకున్న వ్యక్తులు ఇద్దరే. వాళ్లలో ఒకరు కాజోల్ కాగా, మరొకరు సూర్య. సౌత్ నుంచి ఈ ఘనత అందుకున్న తొలి నటుడిగా సూర్య గుర్తింపు పొందాడు.
ఏటా కొంతమంది వ్యక్తులకు మెంబర్ షిప్ అందిస్తుంది ఆస్కార్ జ్యూరీ. ఇందులో మెంబర్ షిప్ పొందాలంటే సదరు నటీనటులు లేదా టెక్నీషియన్ల సినిమాలు ఆస్కార్ కు నామినేట్ అయి ఉండాలి. లేదా ఆల్రెడీ గ్రూప్ లో ఉన్న ఇద్దరు మెంబర్స్ రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఏడాది వరల్డ్ వైడ్ 397 మంది నటీనటులు, టెక్నీషియన్స్ కు మెంబర్ షిప్ అందించింది ఆస్కార్ జ్యూరీ. ఇండియా నుంచి ఈ అరుదైన అవకాశాన్ని కాజోల్, సూర్య దక్కించుకున్నారు.
వచ్చే ఏడాది ఆస్కార్ కు నామినేట్ అయ్యే సినిమాలకు సంబంధించి వీళ్లు పలు విభాగాల్లో ఓటు వేయొచ్చు. అంతేకాదు.. ఆస్కార్ అవార్డు కార్యక్రమానికి కూడా వీళ్లను ఆహ్వానిస్తారు.
రీసెంట్ గా సూర్య నటించిన జై భీమ్, ఆకాశం నీ హద్దురా సినిమాలు ఓటీటీలో సూపర్ హిట్టయ్యాయి. విమర్శల ప్రశంసలు అందుకున్నాయి. వీటిలో జై భీమ్ సినిమా ఆస్కార్ బరిలో నిలిచి ఓడిపోయింది. అయినప్పటికీ సూర్యకు ఆస్కార్ మెంబర్ షిప్ దక్కడం గర్వించదగ్గ విషయం.