నటి మీనా భర్త మృతి
సీనియర్ నటి మీనా కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మీనా భర్త విద్యాసాగర్ కన్నుమూశారు. అతడి వయసు 48ఏళ్లు. 2009లో మీనా, విద్యాసాగర్ వివాహం చేసుకున్నారు. విద్యాసాగర్‌ది బెంగళూర్. కొన్నేళ్లుగా విద్యాసాగర్ ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. క్రమం తప్పకుండా చికిత్స తీసుకుంటున్నారు. పావురాల రెట్ట వల్ల ఫంగస్, బాక్టీరియా వ్యాపిస్తుంటుంది. దాన్ని పీల్చిన వారిలో కొందరికి ఊపిరితిత్తుల వ్యాధులు వస్తుంటాయి. విద్యాసాగర్‌ది అలాంటి సమస్యేనని వైద్యులు గుర్తించారు. ఈ ఏడాది జనవరిలో కుటుంబసభ్యులంతా కోవిడ్ బారినపడ్డారు. అందరూ […]

సీనియర్ నటి మీనా కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మీనా భర్త విద్యాసాగర్ కన్నుమూశారు. అతడి వయసు 48ఏళ్లు. 2009లో మీనా, విద్యాసాగర్ వివాహం చేసుకున్నారు. విద్యాసాగర్‌ది బెంగళూర్.
కొన్నేళ్లుగా విద్యాసాగర్ ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. క్రమం తప్పకుండా చికిత్స తీసుకుంటున్నారు. పావురాల రెట్ట వల్ల ఫంగస్, బాక్టీరియా వ్యాపిస్తుంటుంది. దాన్ని పీల్చిన వారిలో కొందరికి ఊపిరితిత్తుల వ్యాధులు వస్తుంటాయి. విద్యాసాగర్‌ది అలాంటి సమస్యేనని వైద్యులు గుర్తించారు.
ఈ ఏడాది జనవరిలో కుటుంబసభ్యులంతా కోవిడ్ బారినపడ్డారు. అందరూ కోలుకున్నప్పటికీ.. కోవిడ్ ప్రభావం అప్పటికే ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న విద్యాసాగర్‌పై తీవ్రంగా పడింది. ఇన్పెక్షన్ మరింత ఎక్కువైంది.
విద్యాసాగర్‌కు ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ చేసేందుకూ వైద్యులు సిద్ధమయ్యారు. కానీ డోనర్ దొరకడం కష్టమైంది. ఇంతలోనే పరిస్థితి విషమించింది. మంగళవారం రాత్రి చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విద్యాసాగర్ కన్నుమూశారు. మీనా దంపతులకు ఒక కుమార్తె ఉంది.