ఇంటర్ పాసైన అవిభక్త కవలలు.. వీణా వాణి
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులు చక్కని మార్కులతో పాసై ఆనందంలో మునిగిపోయారు. అయితే యూసుఫ్‌గూడలోని స్టేట్ హోంలో ఈ రిజల్ట్స్ పండగ వాతావరణాన్ని తీసుకొని వచ్చాయి. అవిభక్త కవలలు వీణా-వాణి ఇంటర్ సెకెండ్ ఇయర్ ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యారు. వీణా 70 శాతం, వాణి 71 శాతం మార్కులతో పాసవడంతో స్టేట్ హోంలో సంబరాలు అంబరాన్నంటాయి. ప్రభుత్వ అనుమతితో హోంలోనే వీరిద్దరికీ పరీక్షలు నిర్వహించారు. వీరి పరిస్థితి చూసి ఇన్విజిలేటర్ […]
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులు చక్కని మార్కులతో పాసై ఆనందంలో మునిగిపోయారు. అయితే యూసుఫ్‌గూడలోని స్టేట్ హోంలో ఈ రిజల్ట్స్ పండగ వాతావరణాన్ని తీసుకొని వచ్చాయి. అవిభక్త కవలలు వీణా-వాణి ఇంటర్ సెకెండ్ ఇయర్ ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యారు. వీణా 70 శాతం, వాణి 71 శాతం మార్కులతో పాసవడంతో స్టేట్ హోంలో సంబరాలు అంబరాన్నంటాయి. ప్రభుత్వ అనుమతితో హోంలోనే వీరిద్దరికీ పరీక్షలు నిర్వహించారు. వీరి పరిస్థితి చూసి ఇన్విజిలేటర్ కాస్త ఎక్కువ సమయం ఇస్తానని చెప్పినా.. లేదు మేం కేటాయించిన సమయంలోనే రాస్తామని చెప్పారు. చాలా పరీక్షలు నిర్ణీత సమయం కంటే ముందుగానే ముగించినట్లు అధికారులు చెప్పారు.
ఫలితాలు చూసుకున్న వెంటనే వీణా-వాణి కాస్త అప్‌సెట్ అయ్యారట. తమకు ఇంకా ఎక్కువ మార్కులు వస్తాయని అనుకున్నారట. ఇక ఈ అవిభక్త కవలలు పాసైన వెంటనే ఇతర పిల్లలు హోంలో స్వీట్లు పంచిపెట్టారు. ఆటలు, డ్యాన్సులతో హోంను మర్మోగించినట్లు సూపరింటెండెంట్ సఫియా ఖానమ్ చెప్పారు. వీణా-వాణిలు ఆమెను అమ్మా అని పిలుస్తుంటారు. వాళ్లు పాసయ్యేసరికి సొంత తల్లిలాగే ఖానమ్ గర్వంతో మురిసిపోయారు. ఆరోగ్య పరిస్థితులు సహకరించకపోయినా.. టీచర్లు, సిబ్బంది, తోటి వారి సహాయంతో వాళ్లిద్దరూ ఎంతో కష్టపడి చదివారని ఆమె చెప్పారు.
ఇంటర్ పాసవడంతో.. వాళ్లు సీఏ చేయాలని అనుకుంటున్నట్లు ఖానమ్ వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా వీరిపై ప్రత్యేక శ్రద్ద చూపిస్తోందని.. వాళ్లు ఏం చదవాలనుకుంటే దానికి సంబంధించిన ట్యూటర్లను పెడుతోందని ఆమె అన్నారు. వేర్వేరు పరీక్షల కోసం వీణా-వాణి సిద్దపడుతున్నట్లు ఖానమ్ వివరించారు. వీరి చదువుకు ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖ చాలా కృషి చేస్తోందని అన్నారు.
అవిభక్త కవలలుగా పుట్టడంతో వీణా-వాణిలను 2003లో నీలోఫర్ ఆసుపత్రికి తీసుకొని వచ్చారు. ఆపరేషన్ చేసి విడదీయడం కష్టమని వైద్యులు చెప్పడంతో 2017 వరకు అదే ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్లుగా ఉన్నారు. తల్లిదండ్రులు కూడా వీరిని పెంచలేమని చెప్పడం, వీణా-వాణీలు పెద్దగ అవుతుండటంతో వారిని యూసుఫ్ గూడలోని స్టేట్ హోంకు తరలించారు. ఐదేళ్లుగా స్టేట్ హోంలోనే వారిద్దరూ ఉంటున్నారు.
ప్రతీ రోజు ఉదయాన్నే 4.30కు లేచి ట్యూటర్ సహాయంతో 7 గంటల వరకు చదువుతారని.. ఇక మధ్యాహ్నం 1 నుంచి 4 వరకు సొంతంగా చదివేవారని ఖానమ్ చెప్పారు. ఇంటర్‌లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఇద్దరూ చాలా కష్టపడ్డారని ఆమె అన్నారు. కాగా, ఈ అవిభక్త కవలలను స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా అభినందించారు.