తండ్రి అయిన నిర్మాత దిల్ రాజు
నిర్మాత దిల్ రాజు తండ్రి అయ్యారు. నిన్న రాత్రి దిల్ రాజు భార్య తేజశ్విని అలియాస్ మేఘా రెడ్డి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. మొత్తమ్మీద దిల్ రాజు కుటుంబంలోకి వారసుడు ప్రవేశించాడు. దిల్ రాజుకు ఇది రెండో పెళ్లి అనే విషయం తెలిసిందే. 2017లో దిల్ రాజు భార్య అనిత మరణించారు. అప్పటికే కూతురు పెళ్లి చేశారు దిల్ రాజు. […]
నిర్మాత దిల్ రాజు తండ్రి అయ్యారు. నిన్న రాత్రి దిల్ రాజు భార్య తేజశ్విని అలియాస్ మేఘా రెడ్డి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. మొత్తమ్మీద దిల్ రాజు కుటుంబంలోకి వారసుడు ప్రవేశించాడు.
దిల్ రాజుకు ఇది రెండో పెళ్లి అనే విషయం తెలిసిందే. 2017లో దిల్ రాజు భార్య అనిత మరణించారు. అప్పటికే కూతురు పెళ్లి చేశారు దిల్ రాజు. మనవడు కూడా ఉన్నాడు. అయినప్పటికీ, ఒంటరితనం వేధించడంతో కుటుంబ సభ్యుల బలవంతం మేరకు రెండో పెళ్లి చేసుకున్నారు. 2020 మే నెలలో తేజశ్వినిని నిజామాబాద్ లో వివాహమాడారు. ఇప్పుడీ దంపతులకు మగ బిడ్డ జన్మించాడు.
ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు దిల్ రాజు. రీసెంట్ గా ఎఫ్3తో ఓ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం చరణ్-శంకర్ కాంబోలో సినిమా నిర్మిస్తున్నారు. ఇప్పుడిలా ఫ్యామిలీ లైఫ్ లో కూడా సక్సెస్ అయ్యారు. దిల్ రాజుకు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.