ఈ శునకం నేరస్థులకు సింహస్వప్నం
సాధారణంగా పోలీసు అధికారులను, సీబీఐ అధికారులను నేరస్థుల పాలిట సింహస్వప్నంగా అభివర్ణిస్తుంటారు. కానీ తాజాగా ఓ శునకం నేరస్థుల పాలిట సింహస్వప్నంలా మారింది. తప్పు చేయాలనుకొనేవారి వెన్నులో వణుకుపుట్టిస్తోంది కర్ణాటక దావణగెరె జిల్లాలోని ఓ పోలీస్ డాగ్. ఈ శునకం ఇప్పటికే అనేకమంది నేరస్థులను పట్టించింది. దీని పేరు ‘తుంగ 777 చార్లీ’ . పోలీసులకు ఎంతో ఉపయోగపడుతూ.. నేరస్థుల జాడను పట్టిస్తోంది చార్లీ. తాజాగా హొన్నాలి తాలుకాలో జరిగిన హత్యాచార కేసును ఈ జాగిలం ఛేదించింది. […]
సాధారణంగా పోలీసు అధికారులను, సీబీఐ అధికారులను నేరస్థుల పాలిట సింహస్వప్నంగా అభివర్ణిస్తుంటారు. కానీ తాజాగా ఓ శునకం నేరస్థుల పాలిట సింహస్వప్నంలా మారింది. తప్పు చేయాలనుకొనేవారి వెన్నులో వణుకుపుట్టిస్తోంది కర్ణాటక దావణగెరె జిల్లాలోని ఓ పోలీస్ డాగ్. ఈ శునకం ఇప్పటికే అనేకమంది నేరస్థులను పట్టించింది. దీని పేరు ‘తుంగ 777 చార్లీ’ . పోలీసులకు ఎంతో ఉపయోగపడుతూ.. నేరస్థుల జాడను పట్టిస్తోంది చార్లీ.
తాజాగా హొన్నాలి తాలుకాలో జరిగిన హత్యాచార కేసును ఈ జాగిలం ఛేదించింది. ఇందుకు సంబంధించిన వివరాలు.. ఈ నెల 22న హొన్నాలి తాలుకాలోని ఓ గ్రామానికి చెందిన మహిళపై హరీశ్ అనే యువకుడు లైంగికదాడి చేసి.. అనంతరం హత్యచేశాడు. దీంతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు.
చార్లీని సంఘాటనా స్థలానికి తీసుకెళ్లారు. ఘటనా స్థలానికి వచ్చిన శునకం నేరుగా నిందితుడు హరీశ్ ఇంటికి వెళ్లి ఆగింది. హత్య చేసిన అనంతరం హరీశ్.. ఆ ఇంట్లోనే స్నానం చేసి బట్టలు మార్చుకున్నాడు. తుంగ.. నిందితుడు స్నానం చేసిన ప్రదేశానికి సైతం వెళ్లింది. ఈ శునకం 2009 నుంచి తమ దగ్గర ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ జాగిలం ఇప్పటివరకు 70 హత్యకేసులు, 30 దొంగతనం కేసులు ఛేదించిందని పోలీసులు చెప్పారు.