Telugu Global
Health & Life Style

కరోనా కన్నా తీవ్రమైన ‘డిసీజ్ ఎక్స్’ ప్రపంచ‍ంపై దాడి చేయబోతోంది… ‍నిపుణుల హెచ్చరిక‌

కరోనా మహమ్మారితో అతలాకుతలమైన ప్రపంచంపై అంత కన్నా తీవ్రమైన మరో మహమ్మారి దాడి చేయబోతోందని బ్రిటన్ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టెలిగ్రాఫ్ పత్రిక నివేదిక ప్రకారం బ్రిటన్ నిపుణులు ‘డిసీజ్ ఎక్స్’ మహమ్మారి గురించి హెచ్చరికలు జారీ చేశారు. లండన్‌లోని మురుగునీటి నమూనాలలో పోలియోవైరస్ కనుగొనబడిన నేపథ్యంలో ‘డిసీజ్ ఎక్స్’ గురించి ఆరోగ్య నిపుణుల హెచ్చరిక వచ్చినట్లు రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, డిసీజ్ X అనేది తీవ్రమైన వ్యాధికి కారణమవుతుందని ప్రస్తుతం […]

కరోనా కన్నా తీవ్రమైన ‘డిసీజ్ ఎక్స్’ ప్రపంచ‍ంపై దాడి చేయబోతోంది… ‍నిపుణుల హెచ్చరిక‌
X

కరోనా మహమ్మారితో అతలాకుతలమైన ప్రపంచంపై అంత కన్నా తీవ్రమైన మరో మహమ్మారి దాడి చేయబోతోందని బ్రిటన్ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

టెలిగ్రాఫ్ పత్రిక నివేదిక ప్రకారం బ్రిటన్ నిపుణులు ‘డిసీజ్ ఎక్స్’ మహమ్మారి గురించి హెచ్చరికలు జారీ చేశారు. లండన్‌లోని మురుగునీటి నమూనాలలో పోలియోవైరస్ కనుగొనబడిన నేపథ్యంలో ‘డిసీజ్ ఎక్స్’ గురించి ఆరోగ్య నిపుణుల హెచ్చరిక వచ్చినట్లు రాయిటర్స్ రిపోర్ట్ చేసింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, డిసీజ్ X అనేది తీవ్రమైన వ్యాధికి కారణమవుతుందని ప్రస్తుతం దీని గురించి పూర్తి వివరాలు తెలియకపోయినా ఇది అంటు వ్యాధి అని, దీని కారణంగా అంతర్జాతీయంగా ప్రజలు ఊహించలేని సమస్యలు ఎదుర్కొంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కరోనాతో పాటు మంకీపాక్స్, క్రిమియన్-కాంగో ఫీవర్, బర్డ్ ఫ్లూ, లాస్సా ఫీవర్ వంటివి ఇప్పటికే ప్రజలను భయపెడుతున్నాయి. కరోనా వైరస్ పలు రకాలుగా రూపాంతరాలు చెందుతూ ఇప్పటికీ ఆందోళన కలిగిస్తూనే ఉంది. ఇప్పుడు వీటన్నింటికంటే ప్రమాదకరమైన ‘డిసీజ్ ఎక్స్’ ప్రపంచంపై దాడికి సిద్ధంగా ఉందని బ్రిటన్ నిపుణులు హెచ్చరికలు జారీ చేయడం, దీనిని ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని ప్రపంచానికి సూచించడం మరింత‌ ఆందోళనకు గురిచేస్తున్నాయి.

First Published:  28 Jun 2022 9:03 PM GMT
Next Story