తండ్రి గన్ తో చిన్నారిని కాల్చి చంపాడు.. వయస్సు 8 ఏళ్ళు
అమెరికాలో గన్ కంట్రోల్ బిల్లుకు సెనెట్, ప్రతినిధుల సభ ఆమోదించడం, చట్టంగా దీనిపై అధ్యక్షుడు జోబైడెన్ సంతకం చేయడం జరిగిపోయింది. కానీ, గన్ కల్చర్ మాత్రం వెర్రితలలు వేస్తూనే ఉంది. చివరికి చిన్నారుల చేతుల్లోనూ తుపాకులు గర్జిస్తున్నాయి. ఫ్లోరిడాలో జరిగిన ఓ ఘటన ఆశ్చర్యాన్నే కాదు .. షాక్‌కు గురిచేస్తోంది. ఎనిమిదేళ్ల కుర్రాడు తన తండ్రికి చెందిన గన్ తీసుకుని ట్రిగ్గర్ నొక్కడంతో ఓ పాప చనిపోగా మరో చిన్నారి తీవ్రంగా గాయపడింది. 45 ఏళ్ళ రాడెరిక్ […]
అమెరికాలో గన్ కంట్రోల్ బిల్లుకు సెనెట్, ప్రతినిధుల సభ ఆమోదించడం, చట్టంగా దీనిపై అధ్యక్షుడు జోబైడెన్ సంతకం చేయడం జరిగిపోయింది. కానీ, గన్ కల్చర్ మాత్రం వెర్రితలలు వేస్తూనే ఉంది. చివరికి చిన్నారుల చేతుల్లోనూ తుపాకులు గర్జిస్తున్నాయి. ఫ్లోరిడాలో జరిగిన ఓ ఘటన ఆశ్చర్యాన్నే కాదు .. షాక్‌కు గురిచేస్తోంది. ఎనిమిదేళ్ల కుర్రాడు తన తండ్రికి చెందిన గన్ తీసుకుని ట్రిగ్గర్ నొక్కడంతో ఓ పాప చనిపోగా మరో చిన్నారి తీవ్రంగా గాయపడింది. 45 ఏళ్ళ రాడెరిక్ రాండాల్ అనే క్రిమినల్ కొడుకు చేసిన దారుణమిది..
ఇతగాడు తన కొడుకును తీసుకుని తన గర్ల్ ఫ్రెండును కలుసుకునేందుకు ఓ హోటల్ కి వచ్చాడని, అప్పటికే ఆ మహిళ తన రెండేళ్ల కవలలు, ఏడాది వయసున్న కుమార్తెను తీసుకుని అక్కడికి వచ్చిందని పోలీసులు తెలిపారు. కొద్దిసేపటికి రాండాల్ తన పిస్టల్ ని ఒకచోట దాచి బయటకు వెళ్లగా అది కనిపెట్టిన కుర్రాడు దాన్ని తీసుకుని ఆటలాడుతున్నట్టుగా ట్రిగ్గర్ నొక్కాడు. అంతే.. గన్ నుంచి బులెట్లు వెళ్లి రాండాల్ గర్ల్ ఫ్రెండ్ బిడ్డల్లో ఏడాది పాపకు తగిలి అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటనలో మరో చిన్నారి తీవ్రంగా గాయపడింది.
ఆ దుర్ఘటన జరిగిన సమయంలో ఆ తల్లి నిద్ర పోతోందట. కాసేపటికి రాండాల్ వచ్చి చూసేసరికి నెత్తుటి మడుగులో ఓ పాప మృతిచెంది ఉండడం, మరో చిన్నారి గాయపడి అల్లాడుతుండడం కనిపించింది. రాండాల్ క్రిమినల్ మైండ్ వెంటనే పని చేసింది. ఆ గన్ ని తన కొడుకు చేతిలోనుంచి తీసుకుని దాచేశాడు. ఇతని స్నేహితురాలి స్పందన మాత్రం తెలియలేదు.
ఇంత ఘోరం జరిగినా తనకు పట్టనట్టు రాండాల్ ఆ హోటల్ నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే పోలీసులకీ సమాచారం తెలిసి అక్కడికి చేరుకుని అతడ్ని అరెస్టు చేశారు. తన తండ్రిని వారు అరెస్టు చేస్తుండగా అతని కొడుకు అమాయకంగా చూస్తూ ఉండిపోయాడు. అమెరికాలో ఇలా తెలిసీతెలియని పిల్లల చేతుల్లో గన్స్ గర్జించడం, ఎందరో పిల్లలు మరణించడమో, గాయపడడమో జరుగుతోంది. తల్లిదండ్రులు లోడ్ చేసిన తమ ఆయుధాలను నిర్లక్ష్యంగా వదిలి ఎక్కడబడితే అక్కడ వదిలేయడంతో వారి చిన్నారులు ఈ డేంజరస్ గన్స్ ని డమ్మీ పిస్టల్స్ లా భావించి కాల్పులు జరుపుతున్నారని బాలల నిపుణులు వాపోతున్నారు.
ప్రతి ఏడాదీ ఇలాంటి ఘటనలు జరగడం సాధారణమైపోయిందని ‘ఎవెరీ టౌన్ ఫర్ గన్ సేఫ్టీ’ అనే సంస్థ తెలిపింది. ప్రతి సంవత్సరం సగటున ఇలా 350 డెత్స్ సంభవిస్తున్నాయని, పేరెంట్స్ ప్రమాదకరమైన ఆయుధాలను తమ బిడ్డలకు అందుబాటులో లేకుండా చూడాలని ఈ సంస్థ సూచిస్తోంది. అమెరికాలో ఒక్క ఏడాదిలోనే మారణాయుధాల కారణంగా 40 వేల మరణాలు సంభవిస్తున్నాయట.. వీటిలో సూసైడ్లు కూడా ఉంటున్నాయని గన్ వయొలెన్స్ ఆర్చివ్ అనే వెబ్ సైట్ కూడా పేర్కొంది.