సుశాంత్.. ఓ కామెడీ పోలీసాఫీసర్
సుశాంత్ ఓటీటీలో ఎంట్రీ ఇచ్చాడు. జీ5కి ఓ వెబ్ సిరీస్ చేశాడు. తను ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న ఓ మంచి రోల్ తనకు దక్కిందని చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆ పాత్ర ఏంటో తెలుసా? తాజాగా రిలీజైన టీజర్ తో ఆ పాత్ర ఏంటో తెలిసిపోయింది. సుశాంత్ ఇందులో పోలీసాఫీసర్ గా కనిపిస్తున్నాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. కామెడీ పోలీసాఫీసర్ పాత్ర అది. లక్ష్మీ సౌజన్య (వరుడు కావలెను ఫేమ్) దర్శకత్వంలో టాలీవుడ్ నటుడు సుశాంత్ నటించిన […]
సుశాంత్ ఓటీటీలో ఎంట్రీ ఇచ్చాడు. జీ5కి ఓ వెబ్ సిరీస్ చేశాడు. తను ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న ఓ మంచి రోల్ తనకు దక్కిందని చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆ పాత్ర ఏంటో తెలుసా? తాజాగా రిలీజైన టీజర్ తో ఆ పాత్ర ఏంటో తెలిసిపోయింది. సుశాంత్ ఇందులో పోలీసాఫీసర్ గా కనిపిస్తున్నాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. కామెడీ పోలీసాఫీసర్ పాత్ర అది.
లక్ష్మీ సౌజన్య (వరుడు కావలెను ఫేమ్) దర్శకత్వంలో టాలీవుడ్ నటుడు సుశాంత్ నటించిన వెబ్ సిరీస్ “మా నీళ్ల ట్యాంక్’. ఒక చిన్న గ్రామం బ్యాక్ డ్రాప్ లో నీళ్ల ట్యాంక్ కాన్సెప్ట్ తో రూపొందించిన రొమాంటిక్ కామెడీ ఈ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ ఎంతో రిఫ్రెసింగ్ గా ఉంటుంది. మరీ ముఖ్యంగా సుశాంత్ పాత్ర సిరీస్ మొత్తానికి హైలెట్ అవుతుంది.
బుచ్చివోలు అనే గ్రామం నేపథ్యంలో సాగే వెబ్ సిరీస్ ఇది. ఎమ్మెల్యే కోదండం కుమారుడు గోపాల్ తను ప్రేమించిన సురేఖ తిరిగి రాకపోతే పనికిరాని వాటర్ ట్యాంక్‌లో దూకుతానని బెదిరిస్తాడు.అప్పుడే ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఎందుకు తన కొడుకు ఇలా చేస్తున్నాడని కోదండం కంగుతింటాడు .
అతని బంధువు నరసింహం, అదే సమయంలో, అతని ప్రతిష్టను దెబ్బతీయడానికి, అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. అలాగే అదే ఊరిలో గిరి అనే సబ్‌ఇన్‌స్పెక్టర్‌కు ఊరి నుంచి బదిలీ కావాల్సి వస్తే సురేఖను తిరిగి తీసుకొచ్చే పనిని అప్పగిస్తారు.
పనికిరాని ట్యాంక్, అమాయక సురేఖ.. స్వార్థపరుల చేతుల్లో ఎలా కీలుబొమ్మలుగా మారారనే విషయాన్ని రొమాంటిక్ కామెడీ జానర్ లో వినోదాత్మకంగా చూపించారు. సుశాంత్ కొత్త క్యారెక్టర్ ఎలా ఉందో తెలియాలంటే జులై 15 వరకు ఆగాల్సిందే.