Telugu Global

జులైలో రిలీజ్ అయ్యే స్మార్ట్ ఫోన్లు ఇవే..

స్మార్ట్ ఫోన్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న కొన్ని మొబైల్ ఫోన్స్.. జులై నెలలో రిలీజ్ అవ్వబోతున్నాయి. కొత్తగా మొబైల్ కొనాలనుకునే వారు.. జులై నెలలో విడుదలవుతున్న ఈ మొబైల్స్‌ పై ఓ లుక్కేయండి. వన్‌ప్లస్‌ నార్డ్‌ 2టీ 5జీ  ఆండ్రాయిడ్ 12 బేస్డ్ ఆక్సిజన్‌ఓఎస్ 12.1తో పనిచేసే నార్ట్ 2టీ 5జీ.. 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.4 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో రాబోతుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్ ఉపయోగించారు. 50 ఎంపీ ప్రైమరీ […]

జులైలో రిలీజ్ అయ్యే స్మార్ట్ ఫోన్లు ఇవే..
X

స్మార్ట్ ఫోన్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న కొన్ని మొబైల్ ఫోన్స్.. జులై నెలలో రిలీజ్ అవ్వబోతున్నాయి. కొత్తగా మొబైల్ కొనాలనుకునే వారు.. జులై నెలలో విడుదలవుతున్న ఈ మొబైల్స్‌ పై ఓ లుక్కేయండి.

వన్‌ప్లస్‌ నార్డ్‌ 2టీ 5జీ
ఆండ్రాయిడ్ 12 బేస్డ్ ఆక్సిజన్‌ఓఎస్ 12.1తో పనిచేసే నార్ట్ 2టీ 5జీ.. 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.4 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో రాబోతుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్ ఉపయోగించారు. 50 ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంది. 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 80 వాట్‌ సూపర్‌వోక్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. జులై మొదటి వారంలో ఈ మొబైల్ రిలీజ్ అవ్వొచ్చు. ధర రూ. 30వేలలోపు ఉంటుంది.

వన్‌ప్లస్‌ 10 టీ
వన్‌ప్లస్ నుంచి రాబోతున్న మరో ప్రీమియం మోడల్ 10టీ కూడా జులైలోనే రిలీజ్ అవ్వనుంది. ఇందులో 120 హెర్జ్‌ 6.67 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 8+ జెన్‌ 1 ప్రాసెసర్‌తో వచ్చే ఈ మొబైల్‌లో 4,800 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ చేస్తుంది. జులై చివరి వారంలో ఈ మొబైల్ రావొచ్చు.

రియల్‌మీ జీటీ
రియల్‌మీ జీటీ సిరీస్‌ నుంచి జులైలో రెండు కొత్త మోడల్స్‌ రాబోతున్నాయి. రియల్‌మీ జీటీ నియో 3టీ (Realme GT Neo 3), రియల్‌మీ జీటీ2 మాస్టర్‌ ఎడిషన్‌ (Realme GT2 Master Edition)లను వచ్చేనెలలో మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. జీటీ నియో 3టీలో స్నాప్‌డ్రాగన్‌ 870 ప్రాసెసర్‌, 64 ఎంపీ ట్రిపుల్ కెమెరా, అలాగే రియల్‌మీ జీటీ 2 మాస్టర్‌ ఎడిషన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్‌ వన్‌ ప్రాసెసర్, 50 ఎంపీ కెమెరా వంటి ఫీచర్లుంటాయి

నథింగ్ ఫోన్‌ వన్‌
నథింగ్ ఫోన్‌ వన్‌ను జులై 12న ఈ ఫోన్‌ మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ఇందులో 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.43 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ వన్‌ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఆండ్రాయిడ్‌ 12 బేస్డ్ నథింగ్‌ ఓఎస్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. వెనుకవైపు 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు, 8 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలు, ముందు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 45 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. దీని ధర రూ. 35 వేల నుంచి రూ. 40 వేల మధ్య ఉండొచ్చు.

గూగుల్ పిక్సెల్‌ 6ఏ
గూగుల్ నుంచి వస్తున్న ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌తో పనిచేస్తుంది. 60 హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఇందులో టెన్సర్‌ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. పిక్సెల్‌ 6ఏలో వెనుకవైపు రెండు 12 ఎంపీ కెమెరాలు, ముందు 8 ఎంపీ కెమెరా ఉంటుంది. 4,410 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 6 జీబీ ర్యామ్‌/128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌లో లభిస్తుంది. ఈ ఫోన్‌ ధర రూ. 40,000 ఉండొచ్చు.

షావోమి 12 అల్ట్రా
షావోమీ 12 అల్ట్రాలో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల 2K అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్‌ 1 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఈ ఫోన్‌లో లైకా (Leica) కెమెరా సెటప్‌ ఉంది. 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. జులై మొదటి వారంలో విడుదలవ్వొచ్చు. ధర రూ. 50 వేల లోపు ఉంటుంది.

First Published:  28 Jun 2022 10:13 AM IST
Next Story