ఈ రోజు నుంచి రైతుబంధు పైసల పంపిణీ షురూ…..69 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల కోసం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం రైతులు అప్పులపాలు కాకుండా ఆదుకుంటొంది. ముఖ్యంగా పేద, మధ్య తరగతి రైతులు పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా చేసిన ఘనత ఖచ్చితంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుంది. ప్రతి సంవత్సరం రెండు సార్లు డబ్బులు రైతుల ఖాతాల్లో వేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం ఈ సారి 9వ విడత, వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతు బంధు నిధుల పంపిణీ […]
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల కోసం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం రైతులు అప్పులపాలు కాకుండా ఆదుకుంటొంది. ముఖ్యంగా పేద, మధ్య తరగతి రైతులు పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా చేసిన ఘనత ఖచ్చితంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుంది.
ప్రతి సంవత్సరం రెండు సార్లు డబ్బులు రైతుల ఖాతాల్లో వేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం ఈ సారి 9వ విడత, వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతు బంధు నిధుల పంపిణీ ఇవ్వాళ్టి నుంచే మొదలపెట్టింది. మొత్తం 68,94,486 మంది రైతులకు ఎకరాకు 5వేల రూపాయల చొప్పున 7,654.43 కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించనుంది.
రాష్ట్రంలో మొత్తం 1 కోటి 53 లక్షల ఎకరాలకు రైతు బంధు అందనుంది. ఈ సారి కొత్తగా 1లక్షా 50 వేల ఎకరాల భూమిని రైతు బంధు పథకంలో చేర్చారు.ఈసారి కొత్త లబ్ధిదారుల నమోదుకు కేసీఆర్ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో యాసంగి సీజన్‌తో పోల్చితే 3లక్షల 64 వేల మంది రైతులకు ఈ సారి కొత్తగా రైతుబంధు అందనుంది. 2021 జూన్ పదో తేదీ నుంచి 2022 జూన్ ఐదో తేదీ వరకు జరిగిన రిజిస్ట్రేషన్ల ఆధారంగా కొత్త వారికి ఛాన్స్ దక్కనుంది.
ఈ రోజు ఎకరా లోపు భూమి ఉన్న రైతులకు డబ్బుల పంపిణీ జరుగుతుంది. ఈ ఒక్క రోజే 19 లక్షల 98 వేల మంది రైతులకు 586 కోట్ల 65 లక్షల రూపాయలను పంపిణీ చేయనున్నారు.
గత యాసంగి వరకు 50 వేల 448 కోట్ల రూపాయలను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఈ సీజన్‌లో జమ చేయబోయే 7వేల 654 కోట్ల 43 లక్షల రూపాయలను కలిపితే.. మొత్తంగా రైతుబంధు సాయం 58 వేల 102 కోట్ల రూపాయలకు చేరనుంది.
ఒక వైపు కేంద్ర పెడుతున్న ఆర్థిక ఇబ్బందులు, కల్పిస్తున్న అడ్డంకులను దాటుకుంటు కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని కొనసాగించడమే కాక ప్రతి సంవత్సరం కొత్తగా రైతులను ఆ పథకంలో చేర్చడం ఆయనకు రైతులపై ఉన్న ప్రేమకు నిదర్శనమని వ్య్వసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.