వర్షాకాలం మేకప్ ఎలా ఉండాలంటే..
ఎండాకాలం పోయి వానాకాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో మేకప్‌ను జాగ్రత్తగా కాపాడుకోవడం ముఖ్యం. చిరుజల్లులు పడే సమయంలో మేకప్ వేసుకుని బయటకు వెళ్తే అది వెంటనే చెరిగిపోయే అవకాశముంది. అందుకే మేకప్ ఎక్కువసమయం ఉండేందుకు కొన్ని టిప్స్ పాటించాలి. వర్షాకాలంలో మేకప్ ఎంత లైట్‌గా వేసుకుంటే అంత మంచిది. అది కూడా జెల్ లేదా నీటి ఆధారిత మేకప్ ఉత్పత్తులు ఉపయోగించడం వల్ల మేకప్ త్వరగా కరిగిపోకుండా జాగ్రత్తపడొచ్చు. అలాగే వర్షాకాలంలో కచ్చితంగా మాయిశ్చరైజర్ వాడాలి. ముఖం […]
ఎండాకాలం పోయి వానాకాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో మేకప్‌ను జాగ్రత్తగా కాపాడుకోవడం ముఖ్యం. చిరుజల్లులు పడే సమయంలో మేకప్ వేసుకుని బయటకు వెళ్తే అది వెంటనే చెరిగిపోయే అవకాశముంది. అందుకే మేకప్ ఎక్కువసమయం ఉండేందుకు కొన్ని టిప్స్ పాటించాలి. వర్షాకాలంలో మేకప్ ఎంత లైట్‌గా వేసుకుంటే అంత మంచిది.
అది కూడా జెల్ లేదా నీటి ఆధారిత మేకప్ ఉత్పత్తులు ఉపయోగించడం వల్ల మేకప్ త్వరగా కరిగిపోకుండా జాగ్రత్తపడొచ్చు. అలాగే వర్షాకాలంలో కచ్చితంగా మాయిశ్చరైజర్ వాడాలి. ముఖం మీద మేకప్ ప్యాచుల్లా కాకుండా నీట్‌గా రావాలంటే.. మేకప్ వేసుకోవడానికి ముందు ఐస్ ముక్కతో ముఖంపై మర్దన చేసుకోవాలి.
వర్షాకాలంలో ముఖంపై జిడ్డు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫౌండేషన్ ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. చర్మం రంగులో కలిసిపోయే ఫౌండేషన్ ని ఎంచుకొని, కొద్దిగా రాసుకోవాలి. తర్వాత కాంపాక్ట్ వాడటం మర్చిపోవద్దు.
పౌడర్ కి బదులు కాంపాక్ట్ పౌడర్ వాడితే ముఖం తాజాగా ఉంటుంది. ఇక ఇది వర్షాకాలం కాబట్టి మస్కారా, ప్రైమర్, కన్సీలర్ లాంటి మేకప్ ప్రొడక్ట్స్‌ను ఎంచుకునేటప్పుడు వాటిలో వాటర్ ప్రూఫ్, వాటర్ బేస్డ్ ఉత్పత్తుల్ని ఎంచుకుంటే త్వరగా కరిగిపోకుండా ఉంటాయి. ఇకపోతే కంటి మేకప్ కోసం వాటర్‌ప్రూఫ్ లిక్విడ్ లైనర్, మ్యాట్ తరహా ఐషాడో ప్రైమర్.. వంటివి ఎంచుకుంటే త్వరగా చెరిగిపోకుండా చూసుకోవచ్చు.
ఒకవేళ బయట ఎండగా ఉన్నట్టయితే ఎండ వేడికి ఫౌండేషన్ త్వరగా కరిగిపోతుంది. కాబట్టి దీనికి బదులు సీసీ క్రీమ్ ఉపయోగించడం మేలు. ఇక అన్నింటికంటే ముఖ్యంగా మేకప్ పూర్తయ్యాక సెట్టింగ్ స్ప్రేను ఉపయోగిస్తే.. మేకప్ ఎక్కువ సమయం పాటు నిలిచి ఉంటుంది.