Telugu Global
National

రండి..! కూర్చొని మాట్లాడుకుందాం..! నేను మీ కుటుంబ పెద్దనే అనుకోండి

మహారాష్ట్రలో రెబల్ శివ‌సేన నేత ఏక్ నాథ్ షిండే పట్టు బిగిస్తున్నకొద్దీ సీఎం, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే ‘బేర్’మంటున్నారు. సామ, దాన, భేద దండోపాయాలనుపయోగించి తిరుగుబాటు ఎమ్మెల్యేలను తన దారిలోకి తెచ్ఛుకోవాలనుకుంటున్నారు. ఇందులో చివరి మూడు ఉపాయాలూ వర్కౌట్ కాకపోవడంతో దాదాపు కాళ్లబేరానికి దిగుతున్నారు. గౌహతిలో ఉన్న ఎమ్మెల్యేలంతా ముంబైకి తిరిగి రావాలని, అంతా కలిసి కూర్చుని మాట్లాడుకుందామని వారికి విజ్ఞప్తి చేస్తున్నారు. మనలో ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే దాన్ని పరిష్కరించుకుందాం.. గత కొన్ని రోజులుగా […]

రండి..! కూర్చొని మాట్లాడుకుందాం..! నేను మీ కుటుంబ పెద్దనే అనుకోండి
X

మహారాష్ట్రలో రెబల్ శివ‌సేన నేత ఏక్ నాథ్ షిండే పట్టు బిగిస్తున్నకొద్దీ సీఎం, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే ‘బేర్’మంటున్నారు. సామ, దాన, భేద దండోపాయాలనుపయోగించి తిరుగుబాటు ఎమ్మెల్యేలను తన దారిలోకి తెచ్ఛుకోవాలనుకుంటున్నారు.

ఇందులో చివరి మూడు ఉపాయాలూ వర్కౌట్ కాకపోవడంతో దాదాపు కాళ్లబేరానికి దిగుతున్నారు. గౌహతిలో ఉన్న ఎమ్మెల్యేలంతా ముంబైకి తిరిగి రావాలని, అంతా కలిసి కూర్చుని మాట్లాడుకుందామని వారికి విజ్ఞప్తి చేస్తున్నారు.

మనలో ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే దాన్ని పరిష్కరించుకుందాం.. గత కొన్ని రోజులుగా మీరు గౌహతిలోనే చిక్కుబడిపోయారు.. మీ గురించి ప్రతిరోజూ ఏదో ఒక కొత్త సమాచారం నాకు అందుతోంది. మీలో చాలామంది నాతో టచ్ లో ఉన్నారు.. మీరంతా ఇంకా శివసేనలోనే ఉన్నారు.. మీ ఎమ్మెల్యేలలో కొందరి కుటుంబ సభ్యులు కూడా తమ ఫీలింగ్స్ ని నాకు తెలిపారు అని ఆయన ఇక్కడ ఫ్యామిలీ సెంటిమెంటును కూడా జత చేశారు.

సేన కుటుంబ పెద్దగా తన గుండెలోతులోనుంచి చెబుతున్నానని, ఈ గందరగోళం నుంచి బయటపడాలంటే ఏదో ఒక మార్గం ఉందని, ఎవరి తప్పుడు ఆలోచనకు గురి కావద్దని ఉద్ధవ్ ‘జాలిగా’ పేర్కొన్నారు.

పార్టీ మీకిచ్చిన గౌరవం మరెక్కడా కనబడదని, మీరు తిరిగి వచ్చి మాట్లాడితే అన్నీ సర్దుకుంటాయని, శివసేన పార్టీ చీఫ్ గా, ఒక ఫ్యామిలీ హెడ్ గా మీ గురించి తానిప్పటికీ వర్రీ అవుతున్నానని ఉద్ధ‌వ్ థాక్రే వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు.

మీ ఫీలింగ్స్ ని గౌరవిస్తానన్నారు. బహుశా ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందేమోనన్న ఆశతో ఆయన మధ్యాహ్నం రెండున్నర గంటలకు నిర్వహించదలచిన మంత్రివర్గ సమావేశాన్ని సాయంత్రం 5 గంటలకు వాయిదా వేశారు.

నా శిబిరంలో 50 మంది ఎమ్మెల్యేలు.. ఏక్ నాథ్ షిండే

నిన్న మొన్నటివరకు తన క్యాంప్ లో 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పిన ఏక్ నాథ్ షిండే.. ఇప్పుడు 50 మంది ఉన్నారని ప్రకటించారు. తాము శివసేనలోనే ఉన్నామని, పార్టీని తాము ముందుకు తీసుకువెళ్తామని, త్వరలో తమ భవిష్యత్ కార్యాచరణను మీకు తెలియజేస్తామని ఆయన మీడియాకు చెప్పారు.

అయితే షిండే మంగళవారం ముంబైకి వచ్చి గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని కలుస్తారని, తనకు మద్దతునిస్తున్న ఎమ్మెల్యేల జాబితాను ఆయనకు సమర్పిస్తారని కూడా తెలుస్తోంది. తాము బాలాసాహెబ్ థాక్రే ప్రవచించిన హిందుత్వాన్ని తమ భుజాలపై మోస్తున్నామని, తమ పార్టీ అధికారప్రతినిధి దీపక్ కేసర్కర్ అన్ని విషయాలను మీతో పంచుకుంటారని షిండే చెప్పారు. ఇక్కడ ప్రతి ఎమ్మెల్యే కూడా సంతోషంగా ఉన్నారని తెలిపారు.

గవర్నర్ తో భేటీ అవడమే కాకుండా బీజేపీతో సంప్రదింపులు జరిపేందుకు కూడా షిండే మంగళవారం సాయంత్రం ముంబై చేరుకునే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. తనవర్గంలోని 15 నుంచి 20 మంది రెబల్ ఎమ్మెల్యేలు ఉద్ధవ్ థాక్రే శిబిరంతో టచ్ లో ఉన్నట్టు వచ్చిన వార్తలను ఆయన కొట్టిపారేశారు. అటు బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ అప్పుడే ఢిల్లీలో అడుగుపెట్టినట్టు సమాచారం.

కొన్ని రోజులుగా శివసేనను బలహీనపరచడానికి జరిగిన కుట్రలు చూసి అలసిపోయానని, రాజ్యసభ ఎన్నికల్లో శంభాజీ ఛత్రపతి అనే అభ్యర్థి ఎన్నిక కాకుండా చూసేందుకు కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలు యత్నించాయని రెబల్ నేత ఉదయ్ సామంత్ తెలిపారు.

అందుకే ముంబై నుంచి గౌహతికి వచ్చి ఇక్కడ షిండే వర్గాన్ని కలిసినట్టు ఆయన నేడు వివరించారు. సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టిన జూలై 12 లోగా షిండే, ఆయన సహచర ఎమ్మెల్యేలు రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించవచ్చని కూడా తెలుస్తోంది.

First Published:  28 Jun 2022 12:43 PM IST
Next Story