Telugu Global
Health & Life Style

మైగ్రేన్ సమస్యను తగ్గించండిలా..

మైగ్రేన్ తలనొప్పి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని వేధిస్తున్న సమస్య. ప్రపంచ జనాభాలో సగం మంది కనీసం ఏడాదికొకసారైనా మైగ్రేన్ బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. మైగ్రేన్‌కు చాలా కారణాలున్నాయి. అలాగే మైగ్రేన్‌ను నెగ్లెక్ట్ చేయడం వల్ల మరింత ప్రమాదముంటుంది. అందుకే మైగ్రేన్ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే.. మెట్రో నగరాల్లో నివసించే వారికి మైగ్రేన్ సమస్యలు ఎక్కువ. కాలుష్యం, ఒత్తిడి, డిప్రెషన్‌.. లాంటివి మైగ్రేన్‌కి కారణాలు కావొచ్చు. అందుకే తలనొప్పి బాధించేవారు వీలైనంత వరకూ […]

మైగ్రేన్ సమస్యను తగ్గించండిలా..
X

మైగ్రేన్ తలనొప్పి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని వేధిస్తున్న సమస్య. ప్రపంచ జనాభాలో సగం మంది కనీసం ఏడాదికొకసారైనా మైగ్రేన్ బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. మైగ్రేన్‌కు చాలా కారణాలున్నాయి.

అలాగే మైగ్రేన్‌ను నెగ్లెక్ట్ చేయడం వల్ల మరింత ప్రమాదముంటుంది. అందుకే మైగ్రేన్ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

అవేంటంటే.. మెట్రో నగరాల్లో నివసించే వారికి మైగ్రేన్ సమస్యలు ఎక్కువ. కాలుష్యం, ఒత్తిడి, డిప్రెషన్‌.. లాంటివి మైగ్రేన్‌కి కారణాలు కావొచ్చు. అందుకే తలనొప్పి బాధించేవారు వీలైనంత వరకూ పొల్యూషన్‌కు దూరంగా ఉండాలి. ఎక్కువసేపు కూర్చోవడం, కంప్యూటర్‌ స్క్రీన్‌ను చూడడం, నిద్రలేమి, అతి నిద్ర, ఒత్తిడి, డిప్రెషన్, మలబద్ధకం లాంటివి మైగ్రేన్ సమస్యకు ముఖ్య కారణాలు.

అందుకే లైఫ్‌స్టైల్‌ను సరైన గాడిలో పెట్టడం ద్వారా మైగ్రేన్ తగ్గించుకోవచ్చు. మంచి ఆహారం, కంటినిండా నిద్ర, వ్యాయామం ద్వారా మైగ్రేన్‌ తలనొప్పిని నియంత్రించుకోవచ్చు.

మైగ్రేన్ ఉన్నవాళ్లు, కొన్ని పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఆల్కహాల్, స్మోకింగ్‌ను పూర్తిగా మానేయాలి. అలాగే చీజ్, ఫ్యాటీ ఫుడ్స్, ఉప్పును తగ్గించాలి. వీటితో పాటు నచ్చని వాసనలు, పడని పదార్థాలకు దూరంగా ఉండాలి.

గోరు వెచ్చని నీటితో స్నానం, యోగా, మెడిటేషన్, ప్రాణాయామం లాంటివి రోజూ చేయడం ద్వారా ప్రైమరీ హెడేక్స్‌ను తగ్గించొచ్చు. మైగ్రేన్ నొప్పి నుంచి కూడా ఈ చిట్కాలు కొంతవరకూ రిలీఫ్ కలిగిస్తాయి.

మైగ్రేన్‌తో పాటు వాంతులు, కళ్లు తిరగడం లాంటి ఇతర లక్షణాలు కనిపిస్తుంటే.. డాక్టర్ సలహామేరకు మందులు వాడడం మంచిది. మైగ్రేన్ నొప్పి విపరీతంగా వేధిస్తున్నా, మరీ తరచుగా మైగ్రేన్ వస్తున్నా.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. మైగ్రేన్ స్థాయిని బట్టి దానికి చికిత్స అవసరం అవుతుంది.

First Published:  28 Jun 2022 8:50 AM IST
Next Story