Telugu Global
National

బీజేపీ లో చేరాలని విద్యార్థులకు ఆదేశాలిచ్చిన కాలేజ్ ప్రిన్సిపాల్

గుజరాత్‌లోని భావ్‌నగర్‌ నగరంలోని ఓ కళాశాల ప్రిన్సిపాల్‌ అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరాలని విద్యార్థులకు గత వారం లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేశారు. భావ్‌నగర్ స్త్రీ కెలవాని మండల్ ట్రస్ట్‌లోని శ్రీమతి NC గాంధీ BV గాంధీ మహిళా ఆర్ట్స్ కామర్స్ కాలేజ్ ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ రాజన్‌బాల గోహిల్ జూన్ 24 న విద్యార్థినులకు ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశం వివాదమవడంతో ప్రిన్సిపల్ రాజీనామా చేయాల్సి వచ్చింది. “బిజెపి పార్టీలో ప్రముఖ్‌గా […]

బీజేపీ లో చేరాలని విద్యార్థులకు ఆదేశాలిచ్చిన కాలేజ్ ప్రిన్సిపాల్
X

గుజరాత్‌లోని భావ్‌నగర్‌ నగరంలోని ఓ కళాశాల ప్రిన్సిపాల్‌ అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరాలని విద్యార్థులకు గత వారం లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేశారు.

భావ్‌నగర్ స్త్రీ కెలవాని మండల్ ట్రస్ట్‌లోని శ్రీమతి NC గాంధీ BV గాంధీ మహిళా ఆర్ట్స్ కామర్స్ కాలేజ్ ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ రాజన్‌బాల గోహిల్ జూన్ 24 న విద్యార్థినులకు ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశం వివాదమవడంతో ప్రిన్సిపల్ రాజీనామా చేయాల్సి వచ్చింది.

“బిజెపి పార్టీలో ప్రముఖ్‌గా పేరు నమోదు చేసుకోవడానికి ప్రతి విద్యార్థి తమ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను రేపు తీసుకురావాలి. భావ్‌నగర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నివసిస్తున్న విద్యార్థులు మాత్రమే ఇందులో పాల్గొని సభ్యులుగా చేరాలి.

బీజేపీ పార్టీలో సభ్యత్వ డ్రైవ్‌లో చేరడానికి, ప్రతి విద్యార్థి మొబైల్ ఫోన్‌తో రేపు కాలేజీకి రావాలి’’ అని ప్రిన్సిపాల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ ఉత్తర్వులు బహిర్గతమవడంతో గుజరాత్ లో పెద్ద వివాదం చెలరేగింది, కాంగ్రెస్, ఆప్ పార్టీలు బీజేపీపై ఆరోపణలు గుప్పించాయి.

‘‘ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ చెప్పుకుంటోంది. ఇది ఇంత పెద్దఎత్తున ఎలా జరిగిందో ఇప్పుడు తేలిపోయింది. ఇది ఒక్క ఇన్‌స్టిట్యూట్ కాదు. ప్రభుత్వ‌ ఆధ్వర్యంలో పనిచేసే అనేక ఇతర సంస్థలు ఉన్నాయి, వాటిని బీజేపీ నియంత్రిస్తుంది, ”అని కాంగ్రెస్ భావ్‌నగర్ సిటీ యూనిట్ చీఫ్ ప్రకాష్ వాఘని అన్నారు.

ఈ నోటీసు మహిళా విద్యార్థులను అవమానించడమేనని గుజరాత్ ‘ఆప్’ యూనిట్ చీఫ్ గోపాల్ ఇటాలియా అన్నారు.ఇది విద్యా సంస్థా లేక బిజెపి కార్యకర్తలను ఉత్పత్తి చేసే కర్మాగారమా? అని ఆమె ప్రశ్నించారు.

బీజేపీలో చేరాలన్న ప్రిన్సిపాల్ ఆదేశాల‌ గురించి కళాశాల ట్రస్టీలకు తెలిసిందని కాలేజ్ ట్రస్టీ ధీరేన్ వైష్ణవ్ తెలిపారు.
“ జరిగిన సంఘటన గురించి కాలేజీ ట్రస్టీలకు తెలిసింది. ప్రిన్సిపాల్ చాలా మంచి వ్యక్తి . ఇది ఆమె వ్యక్తిగత ఆసక్తితో చేయలేదని మాకు చెప్పారు. ఈ సమస్యను చర్చించడానికి మేము ఈ రోజు ఉదయం ఆమెకు కాల్ చేసాము, కానీ ఆమె తన తప్పును అంగీకరిస్తూ రాజీనామా లేఖ పంపించారు. అని ధీరేన్ వైష్ణవ్ తెలిపారు.

First Published:  27 Jun 2022 9:28 PM GMT
Next Story