Telugu Global

బ్యాన్ దెబ్బకు దిగొచ్చిన గూగుల్.. ట్రాకింగ్ చేయబోమంటూ హామీ

అమెరికాకు చెందిన టెక్నాలజీ కంపెనీ గూగుల్ పేరు వినని వారుండరు. నిత్యం మనం ఏదో ఒక గూగుల్ ప్రొడక్ట్ ఉపయోగిస్తూనే ఉంటాం. ఆపిల్ ఐఫోన్లు తప్ప మిగతా స్మార్ట్ ఫోన్లు అన్నీ గూగుల్ సంస్థకు చెందిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌నే వాడుతున్నాయి. క్రోమ్, మ్యాప్స్ వంటి యాప్స్ చాలా మంది ప్రతీ రోజు వాడుతూనే ఉంటారు. అదే సంస్థ టూల్ అయిన ‘గూగుల్ ఎనలిటిక్స్’ను వెబ్‌సైట్స్ అడ్మినిస్ట్రేటర్లు ట్రాఫిక్ తెలుసుకోవడానికి ఉపయోగిస్తుంటారు. తమ వెబ్‌సైట్ పని తీరు, […]

బ్యాన్ దెబ్బకు దిగొచ్చిన గూగుల్.. ట్రాకింగ్ చేయబోమంటూ హామీ
X

అమెరికాకు చెందిన టెక్నాలజీ కంపెనీ గూగుల్ పేరు వినని వారుండరు. నిత్యం మనం ఏదో ఒక గూగుల్ ప్రొడక్ట్ ఉపయోగిస్తూనే ఉంటాం. ఆపిల్ ఐఫోన్లు తప్ప మిగతా స్మార్ట్ ఫోన్లు అన్నీ గూగుల్ సంస్థకు చెందిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌నే వాడుతున్నాయి.

క్రోమ్, మ్యాప్స్ వంటి యాప్స్ చాలా మంది ప్రతీ రోజు వాడుతూనే ఉంటారు. అదే సంస్థ టూల్ అయిన ‘గూగుల్ ఎనలిటిక్స్’ను వెబ్‌సైట్స్ అడ్మినిస్ట్రేటర్లు ట్రాఫిక్ తెలుసుకోవడానికి ఉపయోగిస్తుంటారు. తమ వెబ్‌సైట్ పని తీరు, ర్యాంకింగ్, వ్యూయర్‌షిప్ దీని ద్వారా తెలుస్తాయి. కాగా, దీనిపై యూరోపియన్ దేశాలు గుర్రుగా ఉన్నాయి. యూరోప్‌కు చెందిన కొన్ని దేశాలు ఈ టూల్‌పై బ్యాన్ విధించాయి.

ఆండ్రాయిడ్ పోలీస్ రిపోర్టు మేరకు.. ‘జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్’ నిబంధనలను గూగుల్ అతిక్రమిస్తోందని ఈయూ దేశాలు ఆరోపిస్తున్నాయి. యూరోప్‌కు చెందిన మూడు దేశాలు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని ఇప్పటికే ఆ టూల్‌పై నిషేధం విధించినట్లు తెలుస్తున్నది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫ్రాన్స్, ఆస్ట్రియా ఇటలీలు గూగుల్ ఎనలిటిక్స్‌ను తమ దేశంలో నిషేధించాయి. ఈ మూడు దేశాలు ఒకే రకమైన కారణంతో నిషేధం విధించడం గమనార్హం.

గూగుల్ ఎనలిటిక్స్.. తమ దేశానికి చెందిన డివైజ్‌లను ట్రాకింగ్ చేసి, వాటి వివరాలను అమెరికా ప్రభుత్వానికి ఇస్తున్నదని ఇటలీ ఆరోపిస్తోంది. అన్‌రెగ్యులర్ డేటా ట్రాన్స్‌మిషన్‌కు గూగుల్ తెరతీసిందని ఇటలీ చెప్తోంది. యూజర్ డేటా, ఐపీ అడ్రస్‌లను కుకీల పేరుతో సేవ్ చేసి.. వాటిని యూఎస్ ప్రభుత్వానికి అందిస్తుందనేని ప్రధాన ఆరోపణ.

కేవలం యూఎస్ ప్రభుత్వమే కాకుండా థర్డ్ పార్టీ సంస్థలు కూడా ఈ డేటాను వీక్షిస్తున్నట్లు సదరు దేశాలు ఆరోపిస్తున్నాయి. ఈ వివరాలను ఉపయోగించి ఎవరైనా అక్రమాలకు పాల్పడితే దానికి గూగుల్ బాధ్యత వహించదని కూడా అంటున్నాయి.

వెబ్ సర్వీసులు అందించే కెఫీనా మీడియా 90 రోజుల్లోగా గూగుల్ ఎనలిటిక్స్ టూల్‌ను వాడటం మానేయాలని ఇటలీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.

కాగా, ఈ బ్యాన్‌పై గూగుల్ తీవ్రంగా స్పందించింది. తాము ఎలాంటి డేటాను ఇతరులకు అందించడం లేదని చెప్తోంది. ఈ బ్యాన్‌పై పోరాడతామని అంటోంది. అయితే తాము యూఎస్‌కు డేటాను తరలిస్తున్న విషయంపై వివరణ ఇవ్వడానికి మాత్రం నిరాకరించింది. గూగుల్ డేటాను యూఎస్ ప్రభుత్వానికి ఇవ్వకుండా ఉంటే.. ఆ టూల్ ఉపయోగించడంలో ఎలాంటి అభ్యంతరం లేదని యూరోపియన్ దేశాలు అంటున్నాయి.

యూరోపియన్ దేశాల్లాగే ఇతర దేశాలు కూడా నిర్ణయం తీసుకుంటే ఆ టూల్‌ను పూర్తిగా ఉపసంహరించాల్సి ఉంటుంది. అందుకే ముందు జాగ్రత్తగా గూగుల్ అనలిటిక్స్ 4ను రూపొందించింది.

2023 కల్లా యూనివర్సల్ అనలిటిక్స్ ప్లాట్‌ఫామ్‌ను మూసేసి.. ప్రాంతాల వారీగా అనలిటిక్స్ రూపొందించే పనిలో పడింది. ఇందులో భాగంగానే అనలిటిక్స్ 4ను తీసుకొని వచ్చింది.

ఇది ట్రాకర్స్ మీద ఆధారపడకుండా పని చేసే టూల్ అని సంస్థ చెప్తోంది. వేర్వేరు పద్దతుల్లో డేటాను కలెక్ట్ చేసి అనలిటిక్స్ అందిస్తామని గూగుల్ అంటోంది. ఎవరి డివైజ్‌ను కూడా ట్రాక్ చేయబోమని కూడా హామీ ఇస్తోంది. మరి అనలిటిక్స్ 4 ఎలా పని చేస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

First Published:  28 Jun 2022 1:22 PM IST
Next Story