Telugu Global
NEWS

నాపై సొంత పార్టీ నేతలే కుట్రలు.. వాళ్ల సంగతి చూస్తా -బాలినేని

సొంత పార్టీ నేతలే తనపై కుట్రలు చేస్తున్నారంటూ మీడియా సమావేశంలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి. వైసీపీలోని కొందరు పెద్ద నాయకులు కూడా వారికి మద్దతివ్వడం సిగ్గుపడాల్సిన విషయం అన్నారు. ఇటీవల ఓ మహిళ వ్యక్తిగత వివాదం విషయంలో తన పేరు అనవసరంగా బయటకు లాగారని, తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారని అన్నారు. టీడీపీ, వైసీపీ నేతలు కలసి కుట్రలు చేస్తున్నారన్న బాలినేని.. త్వరలో అందరి బండారం బయటపెడతానంటూ హెచ్చరించారు. […]

Balineni Srinivasa Reddy
X

సొంత పార్టీ నేతలే తనపై కుట్రలు చేస్తున్నారంటూ మీడియా సమావేశంలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి. వైసీపీలోని కొందరు పెద్ద నాయకులు కూడా వారికి మద్దతివ్వడం సిగ్గుపడాల్సిన విషయం అన్నారు.

ఇటీవల ఓ మహిళ వ్యక్తిగత వివాదం విషయంలో తన పేరు అనవసరంగా బయటకు లాగారని, తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారని అన్నారు. టీడీపీ, వైసీపీ నేతలు కలసి కుట్రలు చేస్తున్నారన్న బాలినేని.. త్వరలో అందరి బండారం బయటపెడతానంటూ హెచ్చరించారు. తన పార్టీ వారు కాబట్టి కొంత అవకాశమిచ్చానని, అందరి సంగతి తేలుస్తానన్నారు.

గతంలో హవాలా డబ్బులు పట్టుబడినప్పుడు కూడా తన పేరు బయటకు లాగారని, హవాలా మంత్రి అంటూ వారే ప్రచారం చేశారని, ఇవన్నీ ఓ పథకం ప్రకారం కుట్రపూరితంగా చేస్తున్నారని ఆరోపించారు బాలినేని. జనసేన మహిళ ఫోన్ కాల్ వివాదంలో కూడా తనకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. పవన్ కల్యాణ్ అభ్యర్థన మేరకే తాను మీడియా ఛానెల్ పై పెట్టిన కేసు వెనక్కి తీసుకున్నానని వివరించారు.

బాలినేని మంచోడే.. కానీ..?
తనతోపాటు, తన కొడుకు పేరు కూడా వివాదాల్లోకి లాగాలనుకుంటున్నారని, బాలినేని మంచోడే కానీ, ఆయన కొడుకే.. అంటూ దీర్ఘాలు తీస్తు తన కొడుకు రాజకీయ జీవితాన్ని కూడా నాశనం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. తనపై జరుగుతున్న కుట్రలపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు బాలినేని. తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాలనుంచి శాశ్వతంగా తప్పుకుంటానని భావోద్వేగానికి గురయ్యారు.

ఆ పెద్దలు ఎవరు..?
కొందరు పెద్దస్థాయి నేతలు, ముఖ్య నేతలంటూ బాలినేని సొంత పార్టీ వారినే టార్గెట్ చేశారు. గతంలో బాలినేని తన మంత్రి పదవి తొలగించిన విషయంలో కూడా అసంతృప్తికి లోన‌య్యారు. ప్రకాశం జిల్లానుంచి తన పేరు తొలగించడం, ఆదిమూలపు సురేష్ ని మంత్రిమండలిలో కొనసాగించడంతో ఆయన మరింత హర్ట్ అయ్యారని అంటారు.

కొన్నాళ్లు ముభావంగా ఉన్నా.. తిరిగి ఆయన యాక్టివ్ అయ్యారు. ఇటీవల ఆత్మకూరు ఉప ఎన్నికల విషయంలో కూడా బాలినేని చురుగ్గా ప్రచారంలో పాల్గొన్నారు. మళ్లీ ఇప్పుడు జనసేన మహిళ ఫోన్ కాల్ వివాదంలో బాలినేని అనుచరుడి పేరు బయటకొచ్చింది. దీనిపై ఆయన సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.

First Published:  28 Jun 2022 1:59 AM IST
Next Story