Telugu Global
NEWS

అధికారంతో ఏం పని? ఇప్పుడే తేల్చుకుందాం- వైసీపీ ఎమ్మెల్యే

రండి.. ఇప్పుడే తేల్చుకుందామంటూ టీడీపీ, బీజేపీ నేతలకు ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సవాల్ చేశారు. ధర్మవరంలో జరిగిన నియోజకవర్గ స్థాయి ప్లీనరీలో మాట్లాడిన ఎమ్మెల్యే.. తమ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు. ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణను ఉద్దేశించి వెంకట్రామిరెడ్డి సవాల్ చేశారు. ”అధికారంలోకి వస్తే అక్రమాలను తేలుస్తా అంటున్నావ్.. ఎప్పుడు వస్తావ్, రంగంలోకి ఎప్పుడు దిగుతావో చెప్పు.. కాళ్లు చేతులు విరుస్తామని […]

అధికారంతో ఏం పని? ఇప్పుడే తేల్చుకుందాం- వైసీపీ ఎమ్మెల్యే
X

రండి.. ఇప్పుడే తేల్చుకుందామంటూ టీడీపీ, బీజేపీ నేతలకు ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సవాల్ చేశారు. ధర్మవరంలో జరిగిన నియోజకవర్గ స్థాయి ప్లీనరీలో మాట్లాడిన ఎమ్మెల్యే.. తమ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు.

ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణను ఉద్దేశించి వెంకట్రామిరెడ్డి సవాల్ చేశారు. ”అధికారంలోకి వస్తే అక్రమాలను తేలుస్తా అంటున్నావ్.. ఎప్పుడు వస్తావ్, రంగంలోకి ఎప్పుడు దిగుతావో చెప్పు.. కాళ్లు చేతులు విరుస్తామని ఆరు నెలలుగా చెబుతున్నావు.. చావడానికి, చంపుకోవడానికి అధికారంతో పనేంటి?. ఎప్పుడైనా కేసులే కదా.. ఇప్పుడే రా చూసుకుందాం” అంటూ కేతిరెడ్డి మాట్లాడారు.

గుడ్ మార్నింగ్ ధర్మవరం నిర్వహిస్తున్నది ఎక్కడెక్కడ విలువైన భూములు ఉన్నాయో గుర్తించి కబ్జా చేసేందుకే అన్న ఆరోపణలను ఎమ్మెల్యే తిప్పికొట్టారు. ఒక్క అడుగు కబ్జా చేసినట్టు నిరూపించినా ఏ శిక్షకైనా సిద్ధ‌మని సవాల్ చేశారు. టీడీపీకి అసలు ధర్మవరం నియోజకవర్గంలో నాయకులు ఎవరని ప్రశ్నించారు.

టీడీపీ వారు ఎంత రెచ్చగొడుతున్నా తమ మాట విని వైసీపీ కార్యకర్తలు సంయమనంతో ఉంటున్నారని.. లేకుంటే టీడీపీ వారిని పల్లెల్లో తరిమి కొట్టే పరిస్థితి ఉండేదన్నారు. ధర్మవరంలో బీజేపీ-టీడీపీ- జనసేన కలిసి వచ్చినా ఒంటరిగా పోటీ చేసేందుకు తాను సిద్ధ‌మన్నారు. టీడీపీ, బీజేపీ నేతలు చేతగాని మాటలు మాట్లాడడం మానేయాలని, వారి బతుకంతా తనకు తెలుసన్నారు. 2019 ఎన్నికల ఉత్సాహంతోనే వైసీపీ కార్యకర్తలు పార్టీ కోసం పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

First Published:  28 Jun 2022 2:19 AM IST
Next Story