Telugu Global
NEWS

మహిళల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్

యూజర్లను ఆకట్టుకునేందుకు వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. అయితే ఆడవాళ్ల ఆరోగ్యానికి సంబంధించి ఓ వాట్సాప్ సర్వీస్.. రీసెంట్‌గా అమలులోకి వచ్చింది. ఒక ప్రముఖ సంస్థతో కలిసి వాట్సాప్ ఈ సేవలను మొదలుపెట్టింది. అవేంటంటే.. మహిళలు తమ నెలసరి సైకిల్‌ని ట్రాక్ చేసుకునే విధంగా వాట్సాప్ ఓ కొత్త సర్వీస్‌ను ప్రారంభించింది. ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్‌గా ఉన్న వాట్సాప్ తమ ప్లాట్‌ఫామ్ ద్వారా అన్నిరకాల సేవలను అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. […]

మహిళల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్
X

యూజర్లను ఆకట్టుకునేందుకు వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. అయితే ఆడవాళ్ల ఆరోగ్యానికి సంబంధించి ఓ వాట్సాప్ సర్వీస్.. రీసెంట్‌గా అమలులోకి వచ్చింది. ఒక ప్రముఖ సంస్థతో కలిసి వాట్సాప్ ఈ సేవలను మొదలుపెట్టింది. అవేంటంటే..

మహిళలు తమ నెలసరి సైకిల్‌ని ట్రాక్ చేసుకునే విధంగా వాట్సాప్ ఓ కొత్త సర్వీస్‌ను ప్రారంభించింది. ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్‌గా ఉన్న వాట్సాప్ తమ ప్లాట్‌ఫామ్ ద్వారా అన్నిరకాల సేవలను అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఆన్‌లైన్ పేమెంట్, షాపింగ్‌, బ్యాంకింగ్‌, మెడికల్‌ సేవలను కూడా అందిస్తోంది. తాజాగా సిరోనా హైజీన్ ప్రైవేట్ లిమిటెడ్(Sirona Hygiene Pvt. Ltd) అనే సంస్థతో కలిసి వాట్సాప్‌ ఓ కొత్త సేవను ప్రారంభించింది.

వాట్సాప్ యూజర్లు +91 9718866644 అనే నంబర్‌కు హాయ్‌ (Hi) అని మెసేజ్‌ చేయడం ద్వారా చాట్‌బోట్ సాయంతో మహిళలు పీరియడ్ ట్రాకర్ సేవలను పొందొచ్చు. భారత దేశంలో తొలిసారిగా వాట్సాప్‌ ద్వారా ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సిరోనా హైజీన్ ప్రైవేట్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో దీప్ బజాజ్ తెలిపారు.

ఈ చాట్‌బోట్ ద్వారా మహిళలు నెలసరి ట్రాకింగ్‌, గర్భదారణ, గర్భదారణ నివారణ వంటి మూడు రకాల సేవలను పొందొచ్చు. ఈ సేవలను పొందేందుకు గాను మహిళలు ముందుగా తమ నెలసరికి సంబంధించిన కొంత ప్రాథమిక సమాచారం నమోదు చేయాల్సి ఉంటుంది. అలా నమోదు చేసిన సమాచారాన్ని చాట్‌బోట్‌ రికార్డు చేసి కచ్చితమైన నెలసరి తేదీని యూజర్‌కు తెలియజేస్తుంది. అంతేకాకుండా యూజర్‌కు ముందుగానే నెలసరి తేదీకి సంబంధించి రిమైండర్‌ను పంపుతుంది.

ఈ ఫీచర్ కోసం ముందుగా +91 9718866644 నంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేయాలి. ఆ తర్వాత వచ్చే మూడు ఆప్షన్లలో పిరియడ్‌ ట్రాకర్‌ అన్న దాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత నెలసరికి సంబంధించిన ప్రాథమిక వివరాలు నమోదు చేయాలి. “రోజువారీ జీవితంలో అంతర్భాగమైన వాట్సాప్‌ ద్వారా మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఈ సర్వీస్‌ను తీసుకొచ్చాం” అని సిరోనా హైజీన్ సీఈవో దీప్‌ బజాజ్‌ తెలిపారు. ఈ ఫీచర్ ద్వారా మహిళలు తమ నెలసరికి సంబంధించిన సమాచారాన్ని మరింత సులువుగా పొందగలరని ఆయన పేర్కొన్నారు.

First Published:  27 Jun 2022 10:00 AM GMT
Next Story