Telugu Global
National

MNSలోకి శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ? బీజేపీ ప్రణాళిక‌

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది. గౌహతిలో క్యాంప్ వేసి ఉన్న‌ 39 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలు రాజ్ ఠాక్రే నాయకత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS)లో చేరేందుకు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ రెండు వర్గాలను కలిపేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆరెస్సెస్ కూడా ఈ ప్రయత్నాలకు పూర్తి అండ దండలు అందిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. MNS ఛీఫ్ రాజ్ ఠాక్రేతో శివ సేన రెబల్ ఎమ్మెల్యేల నాయకుడు ఏక్ […]

MNSలోకి శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ? బీజేపీ ప్రణాళిక‌
X

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది. గౌహతిలో క్యాంప్ వేసి ఉన్న‌ 39 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలు రాజ్ ఠాక్రే నాయకత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS)లో చేరేందుకు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.

ఈ రెండు వర్గాలను కలిపేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆరెస్సెస్ కూడా ఈ ప్రయత్నాలకు పూర్తి అండ దండలు అందిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

MNS ఛీఫ్ రాజ్ ఠాక్రేతో శివ సేన రెబల్ ఎమ్మెల్యేల నాయకుడు ఏక్ నాథ్ షిండే చర్చలు జరిపినట్టు MNS కు చెందిన ఓ ముఖ్య నాయకుడు మీడియాతో తెలిపారు. అయితే తుది నిర్ణయం మాత్రం రాజ్ ఠాక్రేదే అని ఆ నాయకుడు చెప్పారు.

అయితే రాజ్ ఠాక్రే అనారోగ్యంగా ఉన్నందువల్ల ఆయనను పరామర్శించేందుకే ఆయనకు ఫోన్ చేశానని ఏక్ నాథ్ షిండే చెప్తున్నారు.

కాగా MNS కు అసెంబ్లీలో ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నారు. అయినప్పటికీ 39 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలు MNS లో చేరాలని నిర్ణయించుకోవడానికి ప్రధాన కారణం. అనర్హత వేటు నుండి తప్పించుకోవడానికే అని విశ్లేషణలున్నాయి.

మరో వైపు ఇప్పటికే MNS స్నేహంగా ఉన్న బీజేపీ కూడా శివసేన రెబల్ ఎమ్మెల్యేలను MNSలో చేర్చడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. ఆ దిశగా ఫడ్నవీస్ ఇప్పటికే ఇరువర్గాలతో మంతనాలు జరిపినట్టు సమాచారం.

వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ముంబై, పుణెలలో ఎంఎన్‌ఎస్‌కు కొన్ని సీట్లు ఇచ్చి మిగతా రాష్ట్రమంతా తానే ఒంటరిగా పోటీ చేయాలని బీజేపీ భావిస్తోంది. ఈ విషయంపై MNS, BJP మధ్య ఏప్రిల్ 21 న ముఖ్యమైన సమావేశం కూడా జరిగింది. ఆ సమావేశంలో సంఘ్ వ్యక్తులు పాల్గొన్నారు.

శివసేనకు పోటీగా MNSను ప్రోత్సహించాలని ఆరెస్సెస్, బీజేపీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు శివసేన రెబల్ ఎమ్మెల్యేలను MNSలో చేర్పించే ప్రయత్నం జరుగుతోంది.

అంతే కాక శివసేన రెబల్ ఎమ్మెల్యేల నాయకుడు ఏక్ నాథ్ షిండే, MNS ఛీఫ్ రాజ్ ఠాక్రే ఇద్దరూ ఒకప్పటి సహచరులు. ఇద్దరూ బాలాసాహెబ్ శిష్యులు కూడా. ఇద్దరు కూడా హిందుత్వ రాజకీయాలతో ఉన్నారు. కాబట్టి ఈ రెండు వర్గాలు ఏకమైతే తమకు ప్రయోజనమని బీజేపీ భావిస్తోంది.

మరో వైపు ఉద్దవ్ ఠాక్రే అంటే భగ్గున మండి పోయే MNS ఛీఫ్ రాజ్ ఠాక్రే ప్రస్తుతం శివసేనలో జరుగుతున్న పరిణామాలతో ఆనందంలో ఉన్నారు. ఈ పరిణామాల నుండి తాను ప్రయోజనం పొందాలని, ఉద్దవ్ ఠాక్రేను లేవలేకుండా దెబ్బ కొట్టాలని రాజ్ ఠాక్రే ప్రణాళికలు రచిస్తున్నారు. అందువల్లే శివసేన రెబల్ ఎమ్మెల్యేలతో చేతులు కలపడానికి సిద్దంగా ఉన్నారు.

First Published:  27 Jun 2022 3:05 PM IST
Next Story