Telugu Global
National

ఇకపై అక్కడ పెళ్ళిళ్ళలో దావత్, బ్యాండ్, బాజా, బారాతులుండవు

ఇకపై అక్కడ పెళ్ళిళ్ళలో పెద్ద ఎత్తున ఊరేగింపులుండవు…వరుడు గుర్రంపై ఊరేగడాలుండవు… DJలుండవు…. బాణాసంచా కాల్చ‌డాలు ఉండవు…పెద్ద ఎత్తున దావతులుండవు…. ఇవన్నీ ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. రాజస్థాన్ లోని ఓ 19 గ్రామాలు ఇప్పుడీ నిర్ణయం తీసుకున్నాయి. రాజస్థాన్‌లోని పాలి జిల్లాలోని కుమావత్, జాట్ కమ్యూనిటీల పెద్దలు సమావేశమయ్యి ఈ నిర్ణయాలు ప్రకటించారు. పేదరికంతో అల్లాడుతున్న ప్రజలకు ఖర్చు తగ్గించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ రెండు కులాల నాయకులు ప్రకటి‍ంచారు. జూన్ 16న 19 […]

ఇకపై అక్కడ పెళ్ళిళ్ళలో దావత్, బ్యాండ్, బాజా, బారాతులుండవు
X

ఇకపై అక్కడ పెళ్ళిళ్ళలో పెద్ద ఎత్తున ఊరేగింపులుండవు…వరుడు గుర్రంపై ఊరేగడాలుండవు… DJలుండవు…. బాణాసంచా కాల్చ‌డాలు ఉండవు…పెద్ద ఎత్తున దావతులుండవు…. ఇవన్నీ ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. రాజస్థాన్ లోని ఓ 19 గ్రామాలు ఇప్పుడీ నిర్ణయం తీసుకున్నాయి.

రాజస్థాన్‌లోని పాలి జిల్లాలోని కుమావత్, జాట్ కమ్యూనిటీల పెద్దలు సమావేశమయ్యి ఈ నిర్ణయాలు ప్రకటించారు. పేదరికంతో అల్లాడుతున్న ప్రజలకు ఖర్చు తగ్గించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ రెండు కులాల నాయకులు ప్రకటి‍ంచారు.

జూన్ 16న 19 గ్రామాలకు చెందిన కుమ్మవత్ అనే కుమ్మరుల సంఘం సభ్యుల సమావేశంలో కొన్ని నిబంధనలను రూపొందించారు.

అలంకరణలు, సంగీతం, ఇతర ఆచారాల కోసం అనవసరంగా భారీ మొత్తంలో ఖర్చు చేయకూడదు.

‘బండోలి’ నుండి ‘బారాత్’ వరకు ఎలాంటి పెద్ద ఊరేగింపు ఉండకూడదు.

థీమ్ వివాహాలు, అలంకరణలు, DJ ఉండకూడదు. బాణసంచా కాల్చకూడదు,వరుడు గుర్రపు స్వారీ చేయకూడదు.

వధూవరులకు బహుమతిగా నగలు, నగదు పరిమితి ఉండాలి.

వరుడు గడ్డంతో ఉండకూడదు, క్లీన్ షేవ్ చేసుకోవాలి.

అదేవిధంగా, పాలిలోని రోహెత్ సబ్‌డివిజన్‌లోని ఐదు గ్రామాలకు చెందిన జాట్ కమ్యూనిటీ కూడా వివాహ కార్యక్రమాలను హుందాగా చేయడానికి నిబంధనలను రూపొందించింది, వివాహ ఊరేగింపులను నిలిపివేయాలని నిర్ణయించుకుంది. వీళ్ళు కూడా కుమ్మవత్ కమ్యూనిటి చేసిన అన్ని నిర్ణయాలను చేశారు.

“సమాజంలోని అన్ని కుటుంబాలకు వివాహాలలో ఏకరూపతను తేవడానికి, మేము కొన్ని సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయించుకున్నాము” అని భకరివాలా గ్రామ సర్పంచ్ అమ్నారం బేనివాల్ అన్నారు.

డబ్బు ఉన్నవారు తమ కుటుంబాల్లో పెళ్లిళ్లను తమ హోదా చూయించుకునే సాధనంగా భావిస్తారని, ఇది ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలలో న్యూనతాభావాన్ని తెస్తుందని, దాంతో వారు అప్పులపాలు కావాల్సి వస్తుందని బెనివాల్ అన్నారు.

ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై జరిమానా లేదా శిక్ష విధించేందుకు రెండు సంఘాలు నిర్ణయించాయి. ఆయా గ్రామాల్లో నివసించే వారందరూ ఈ నిబంధనలు పాటించడం తప్పనిసరి

First Published:  27 Jun 2022 4:41 AM IST
Next Story