Telugu Global
National

శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్‌కు ఈడీ షాక్‌!

మహారాష్ట్రలో రాజ‌కీయ సంక్షోభం కొన‌సాగుతుండ‌గానే శివ‌సేనకు మ‌రో షాక్ త‌గిలింది. ఆ పార్టీ ఎంపీ, సీనియ‌ర్ నేత సంజ‌య్ రౌత్‌ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స‌మ‌న్లు జారీ చేసింది. విచార‌ణ నిమిత్తం మంగ‌ళ‌వారం త‌మ కార్యాల‌యానికి రావాల‌ని నోటీసులో ఈడీ పేర్కొంది. రూ.1,034 కోట్ల పాత్రా చాల్ భూకుంభకోణం కేసుకు సంబంధించి సంజ‌య్‌కి ఈ స‌మ‌న్లు జారీ అయ్యాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్‌లో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సంజయ్ రౌత్ భార్య వ‌ర్షా రౌత్, పల్ఘర్, […]

శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్‌కు ఈడీ షాక్‌!
X

మహారాష్ట్రలో రాజ‌కీయ సంక్షోభం కొన‌సాగుతుండ‌గానే శివ‌సేనకు మ‌రో షాక్ త‌గిలింది. ఆ పార్టీ ఎంపీ, సీనియ‌ర్ నేత సంజ‌య్ రౌత్‌ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స‌మ‌న్లు జారీ చేసింది. విచార‌ణ నిమిత్తం మంగ‌ళ‌వారం త‌మ కార్యాల‌యానికి రావాల‌ని నోటీసులో ఈడీ పేర్కొంది. రూ.1,034 కోట్ల పాత్రా చాల్ భూకుంభకోణం కేసుకు సంబంధించి సంజ‌య్‌కి ఈ స‌మ‌న్లు జారీ అయ్యాయి.

ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్‌లో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సంజయ్ రౌత్ భార్య వ‌ర్షా రౌత్, పల్ఘర్, థానే జిల్లాల్లోని గురు ఆశిష్ కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ మాజీ డైరెక్టర్ ప్రవీణ్ రౌత్, మ‌రికొంద‌రికి చెందిన రూ. 11.15 కోట్ల విలువైన ఆస్తులను దర్యాప్తులో అటాచ్ చేసింది.

భ‌య‌ప‌డేది లేదు..
త‌న‌కు ఈడీ స‌మ‌న్లు పంపించింద‌ని సంజ‌య్ రౌత్ చెప్పారు. అయినా తాను భయపడే వ్యక్తిని కానని చెప్పారు. తన ఆస్తులను సీజ్ చేసినా, తనను షూట్ చేసినా, జైలుకు పంపినా భయపడనని.. తాను బాలాసాహెబ్ థాక్రే అనుచరుడినైన శివసైనికుడినని అన్నారు. ఇది ప్రతీకార చర్య అని ఆరోపించిన ఆయన, తనపై ఈడీ చేసిన వాదనలు త‌ప్ప‌ని రుజువ‌వుతాయ‌న్నారు.

మ‌రోవైపు సుప్రీంలో రెబ‌ల్స్ అన‌ర్హ‌త ప‌టిష‌న్ పై విచార‌ణ కొన‌సాగుతోంది. ఏక్ నాథ్ షిండే బృందం త‌ర‌ఫున సీనియ‌ర్ న్యాయ‌వాది హ‌రీష్ సాల్వే, ఉద్ధ‌వ్ థాక్రే త‌ర‌ఫున సీనియ‌ర్ న్యాయ‌వాదులు అభిషేక్ మ‌ను సింఘ్వీ, క‌పిల్ సిబ‌ల్ వాద‌న‌లు వినిపిస్తున్నారు. హైకోర్టుకు వెళ్ల‌కుండా సుప్పీం కోర్టుకే నేరుగా ఎందుకు వ‌చ్చార‌ని రెబ‌ల్ ఎమ్మెల్యేల‌ను సుప్రీం ధ‌ర్మాస‌నం ప్ర‌శ్నించింది.

First Published:  27 Jun 2022 7:45 AM IST
Next Story